Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Srirasthu Shubhamasth First Look..

By   /  February 14, 2016  /  Comments Off on Srirasthu Shubhamasth First Look..

    Print       Email

Allu-Sirish 1

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్ లుక్ విడుదల..
అల్లు శిరీష్ విభిన్నమైన సినిమా ‘కొత్త జంట’తో విజయాన్ని అందుకున్నారు. ఆయన సరసన వరుస విజయాలతో దూసుకెళ్తున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘శ్రీరస్తు శుభమస్తు’. రీసెంట్ గా ఈ టైటిల్ ను ఖరారు చేశారు. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ని కథలుగా మలచుకునే డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 90 శాతం మేర కంప్లీట్ అయింది. ఇంకా మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

InCorpTaxAct
Suvidha

ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడింది. అల్లు శిరీష్ ఎనర్జీ సూపర్బ్ అని చిత్ర దర్శకుడు పరశురామ్ అన్నారు. తనకు ఎప్పటి నుంచో అల్లు శిరీష్ తో స్నేహం ఉందన్నారు. ఆయన కోసమే సినిమా చేశానని తెలిపారు. శిరీష్ కి తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే అతని రియల్ క్యారెక్టర్ కి దగ్గర ఉండే కథతో సినిమా నిర్మించానని తెలిపారు. ఈ సినిమాలో శిరీష్ నటించిన పాత్రను చూసిన వారంతా ఆ పాత్రలో తమను తాము ఊహించుకుంటారని అన్నారు. శిరీష్ నటించిన పాత్ర చాలా బాగా వచ్చిందన్నారు. శిరీష్ నటన అయితే సూపర్బ్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో ప్రతి పాత్రను చాలా అందంగా తీర్చిదిద్దారు దర్శకుడు పరశురామ్. తెరమీద వీరందరి క్యారెక్టర్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. మూవీలో అన్ని క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉందని తెలిపింది.

ఈ చిత్రంలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి కనిపించనుంది. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, రావు రమేష్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం – తమన్.యస్.యస్, యాక్షన్ – రామ్, లక్ష్మణ్,ఆర్ట్ – రామాంజనేయులు, డిఓపి – మని కంతన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- నాగరాజు, ఎడిటర్ – మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత – అల్లు అరవింద్, దర్శకుడు – పరశురామ్

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →