Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Star Studded Movies Release Dates

By   /  February 27, 2016  /  Comments Off on Star Studded Movies Release Dates

    Print       Email

Oopiri-Movie-Still1

బడా హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు..!

InCorpTaxAct
Suvidha

 

ఈ సారి టాలీవుడ్ లో సమ్మర్ బరిలో బడా బడా స్టార్లు పోటీపడబోతున్నారు. మార్చి లో ‘ఊపిరి’తో ఇంచుమించుగా సమరం మొదలు కాబోతోంది. ‘ఊపిరి’ రిలీజ్ అయిన రెండు వారాలకు పవన్ కల్యాణ్ మూవీ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వచ్చేస్తున్నాడు. తర్వాత ‘సరైనోడు’ రాబోతున్నాడు. తర్వాత ‘బ్రహ్మోత్సవం’ మూవీతో మహేష్ కూడా రంగంలోకి దిగబోతున్నాడు. ఈ సినిమాలన్నీ ఏప్రిల్ నెలలోనే రాబోతున్నాయని ప్రచారం సాగింది. అయితే సరైనోడు, బ్రహ్మోత్సవం విడుదల తేదీల మీద సరైన క్లారిటీ లేదు. దీంతో ఆ హీరోల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో కూడా ఫుల్ క్లారిటి వచ్చేసింది.

 

‘బ్రహ్మోత్సవం’ మూవీ ఏప్రిల్ 29న కాకుండా మే 31న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీనికి కారణం.. అనుకున్న సమయంలో షూటింగ్ కంప్లీట్ కాకపోవడమేనట. మే నెలకు ఎలాగు వాయిదా పడింది కాబట్టి.. ఆ నెలలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. దీంతో ‘సరైనోడు’కి ఏ డేట్ సరైనదో ఎంచుకునే అవకాశం వచ్చేసింది. దీంతో బాగా ఆలోచించి ఏప్రిల్ 22న రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఇక ఆయా సినిమాలకి థియేటర్లు కూడా బుక్ అయిపోయాయి కాబట్టి.. ఇక తేదీలలో మార్పులు లేనట్లే. అంటే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ల విషయంలో ఫుల్ క్లారిటి వచ్చేసినట్లే కదా.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →