Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Steve Smith’s father dumps son’s Cricket kit in Garage

By   /  April 3, 2018  /  Comments Off on Steve Smith’s father dumps son’s Cricket kit in Garage

    Print       Email

స్టీవ్ స్మిత్ తండ్రికి కోపమొచ్చింది

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* స్మిత్ క్రికెట్ కిట్‌ను కార్ల షెడ్డులో ప‌డేసిన పీట‌ర్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: త‌న కొడుకు గొప్ప వాడు కావాల‌ని, అత‌న్ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆ మాట‌లు విని మురిసిపోవాల‌ని ప్ర‌తి తండ్రీకి ఉంటుంది. కొడుకు ప్ర‌యోజ‌కుడు అయితే అంత‌కంటే ఆనందం ఏ తండ్రీకి ఉండ‌దు. కానీ కొడుకు చెడ్డ‌పేరు తెస్తున్నాడంటే ఆ తండ్రికి ప‌ట్ట‌రాని కోపం వ‌స్తుంది. అయితే ఇక్క‌డే ఆ తండ్రికి కోపం వ‌చ్చిందో.. త‌న కొడుకును కాపాడాల‌నుకున్నాడో తెలియ‌దు కానీ.. కొడుకు ఇష్ట‌మైన దానికి కార్ల‌షెడ్డులో ప‌డేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే… స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను తీసుకెళ్లి కార్ల షెడ్డులో పడేశాడు అతడి తండ్రి. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా.. స్మిత్, వార్నర్, బాన్‌రక్రాఫ్ట్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో స్మిత్ పక్కనే అతడి తండ్రి పీటర్ స్మిత్ కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా తన కుమారుడు స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను కారులోంచి తీసి కార్ల షెడ్డులో పడేశాడు. ఆ వీడియోను అక్కడి మీడియా విడుదల చేసింది. అనంతరం ‘‘అతడు బాగానే ఉంటాడు.. కోలుకుంటాడు. కోలుకుంటాడు..’’ అని మీడియాతో మూడు ముక్కల్లో తేల్చేశారు పీటర్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →