Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Strong warning to Congress President Rahul Gandhi

By   /  March 10, 2018  /  Comments Off on Strong warning to Congress President Rahul Gandhi

    Print       Email

రాహుల్ గాంధీకి వార్నింగ్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* ఫేక్ వీడియోను తీసేస్తారా?  కోర్టుకు వ‌స్తారా?

* మీ పబ్లిసిటీ కోసం నా ప‌రువు తీస్తారా?

* రాహుల్‌ను హెచ్చ‌రించిన ప్ర‌స‌న్‌జీత్ కే బ‌సు

డెక్క‌న్ అబ్రాడ్:  కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీకి కాలం క‌లిసి రాన‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌న ఒక‌టి అనుకుంటే విధి మ‌రొక‌టి త‌లుస్తోంది. ఫ‌లితంగా నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు. తాజాగా ఓ వీడియో వివాదంలో చిక్కుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. సింగపూర్‌లోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఇండియా @ 70’ అనే కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. భారతీయులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రసన్‌జీత్ కే బసు అనే భారత సంతతి ఆర్థికవేత్త.. రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడిగారు. 70 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ వాళ్లే దేశాన్ని పాలించినా.. దేశ తలసరి ఆదాయం మాత్రం ఎందుకు పెరగట్లేదని, కాంగ్రెస్ హయాంలో రానురాను మరీ హీనంగా తయారైందని ప్రశ్నించారు. ఆ వెంటనే మరో వ్యక్తి లేచి కాంగ్రెస్ చాలా చేసిందని చెప్పారు. వారిద్దరి ప్రశ్నలు, అభిప్రాయాలకు సమాధానం చెప్పిన రాహుల్ గాంధీ.. ఒకరేమో బాగుందంటున్నారని, మరొకరేమో బాగాలేదంటున్నారని చెబుతూ.. దానిపైనా ఓ పుస్తకం రాయాలన్నారు.

ఇప్పుడు రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యల తాలూకు వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్.. రానురాను రాజకీయాలు మరింత దిగజారిపోతున్న తరుణంలో తప్పుదోవ పట్టించేవాళ్లను ఎలా హాండిల్ చేయాలో రాహుల్ చేసి చూపించారంటూ ట్వీట్ చేసింది.అయి తే, దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు ఆర్థిక వేత్త.. అదో ఫేక్ వీడియో అని మండిపడ్డారు. ‘‘మీ లీడర్‌ ప్రతిష్ఠను పెంచేందుకు నా ఇమేజ్‌ను చాలా చెత్తగా చేసి చూపిస్తారా? అసలు జరగనే జరగని వాటిని పట్టుకుని వీడియో పెట్టేసి నన్ను అబాసుపాల్జేయడమేంటి? ఈ ఫేక్ వీడియోను తీసేయండి. లేదంటే సింగపూర్ కోర్టుల్లో కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధమవండి’’ అని ఆయన ట్విట్టర్‌లో హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →