హెచ్ సీయూలో ఉద్రిక్తత..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టడుకుతోంది. వీసీ అప్పారావు ముర్దాబాద్ అనే నినాదాలతో వర్సిటీ ప్రాంగణం మార్మోగుతోంది. అయితే విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీసీ అప్పారావును తక్షణం బర్తరఫ్ చేయాల విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బుధవారం నిర్వహించ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్ధి సంఘాలు, హెచ్ సీయూ , ఓయూ జేఏసీ కమిటీలు సంయుక్తంగా పిలుపు నిచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ సహా పలు ప్రజా సంఘాలు వర్సిటీ దగ్గరకు చేరుకున్నాయి.అయితే ముందస్తు చర్యలో భాగంగా గేటుకు తాళాలు వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్ధులు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గేటు ఎక్కిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకోవడంతో ఇరువర్గాల తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. లోనికి పర్మిష్ లేదని, గేటు దూకేందుకు ప్రయత్నించారని దీనితో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.