సోనోవాల్ స్థానంలోకి స్వామి?
సుబ్రహ్మణ్య స్వామి… ఈయన కాంగ్రెస్‌పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించిన వ్యక్తి. కాంగ్రెస్‌ను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా నేటికీ ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. వాళ్ల అవినీతి అక్రమాలను, ఆస్థి పాస్తులను ఎప్పటికప్పుడు బయట పెడుతూ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తికి బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని మోడీ భావించినట్లు ఉన్నారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఈమధ్య వరకు కేంద్ర మంత్రిగా ఉన్న శర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన స్థానం ఖాళీ అయిందని, అలాగే మిత్ర పక్షాలకు సంబంధించి కూడా సర్దుబాట్లు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీ నుంచి కేంద్ర కేబినెట్లో మరింత మందికి చోటు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మంత్రివర్గాన్ని విస్తరించే పక్షంలో తమకు స్థానం కల్పించాలని కోరుతున్న ఆశావహుల జాబితా భారీగానే ఉన్నట్టు సమాచారం. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలన్నీ తమ ఎంపీలకు మంత్రిపదవులు ఇప్పించుకోవాలన్న ఆలోచనలో తమవంతు ప్రయత్నాలు చేస్తూ, హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయం స్పష్టమైంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.