వైసీపీలోకి భారీగా చేరికలు
మొన్నటి వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు.. నాయకులు వెళ్లడమే తప్పితే ఆ పార్టీలోకి వచ్చే వారే లేరు. గత రెండు, మూడు నెలలుగా ఏమైందో ఏమోకానీ వైసీపీలోకి మాజీలు క్యూ కడుతున్నారు. జిల్లాల్లో కూడా ఆ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. మొన్నటి వరకు వలసలతో ఇబ్బంది పడిన వైసీపీ ఇప్పుడు చేరికలతో సంతోషపడుతోంది. తాజాగా నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలు వైసీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ జెండా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పోలా అజయ్, జడ్పీ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరంతా చేరారు.
కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి చెందిన 50 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాటసాని వర్గీయులను గౌరు వెంకట్ రెడ్డి తన నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గణేష్‌నగర్, టెలికాంనగర్‌కు చెందిన కాటసారి వర్గీయులతో పాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పివి శేఖర్, పి. శ్రీనివాసులు, కె. మద్దిలేటి, ఈశ్వరయ్య, సూరి, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి బాల సుందరం, లక్ష్మణ్‌నాయక్‌తో పాటు మరో 50 మంది వైయస్ఆర్సీపీలో చేరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.