ఆ రెండూ చేసిఉంటే స్టార్ హీరో అయ్యేవాడట..!
కమెడియన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. ఆరంభంలో ఈ అందాలరాముడికి కొన్ని విజయాలు కూడా దక్కాయి. అయితే.. ఇటీవలి కాలంలో సునీల్ ను వరుసగా పరాజయాలే పలకరిస్తున్నాయి. దీనికి కారణం సునీల్ నిర్ణయాలేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఓ హీరో తన కెరీర్ కి సంబంధించి మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే వరుస విజయాలు దక్కుతాయి. కాని సునీల్ సెలెక్ట్ చేసుకున్న కథలు మాత్రం బోల్తా పడుతున్నాయి. వదిలిపెట్టేసిన కథలు హిట్ అవుతున్నాయి.
ఇలా ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకోవడానికి కూడా కారణం ఉంది. ఏడాది క్రితం నానీ హీరోగా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా కోసం ముందుగా సునీల్ ను సంప్రదించారట. అయితే ఈ మర్యాద రామన్న చాలా మర్యాదగా ఈ సినిమాని తిరస్కరించారట. తర్వాత ఆ సినిమాని నానీతో తీయడం.. అదికాస్తా బంపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి. అంతేనా.. ఈ హిట్ తో నానీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అలాగే.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘బిచ్చగాడు’ సినిమా కోసం కూడా సునీల్ ను సంప్రదించారట. అయితే కథ తనకు సూట్ కాదంటూ మళ్లీ తిరస్కరించాడట. దీంతో నిర్మాతలు తెలుగులో డబ్ చేశారట. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రేక్షకాదర పొందింది. ఈ రెండు సినిమాలను సునీల్ రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే.. ఆ హిట్స్ ఆయన ఖాతాలో పడేవని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అదే జరిగిఉంటే సునీల్ కూడా స్టార్ హీరో మాదిరి అయ్యేవాడని చర్చించుకుంటున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.