షారూఖ్ తో సన్నీ లియోన్ స్టెప్పులు..
ఇటీవలి కాలంలో బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది.రీసెంట్ గా షారూఖ్ ఖాన్‌తో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ‘రెయిస్’ మూవీలో షారూఖ్‌తో కలిసి ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేయ బోతోందని సమాచారం. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోతో కలిసి నటించని సన్నీలియోన్ కి షారూఖ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం రావడంతో.. ఈ విషయం కాస్తా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సన్నీకి ఛాన్స్ రావడానికి కారణం షారూఖ్ ఖాన్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటేనని సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
‘నా చిత్రంలో కాస్టింగ్ ఎవరుంటారనేది నేనెప్పుడూ చూడను. అంతా డైరెక్టర్ ఇష్ట ప్రకారంగానే నడుచుకుంటాను. అందులో భాగంగా సన్నీతో నటించాలని డైరెక్టర్ చెబితే సంతోషంగా ఒప్పుకుంటా..సన్నీ ఓ వండర్ఫుల్ యాక్టర్. ఏ ఆర్టిస్టుకైనా వారిలో ఉండే సామర్ధ్యాన్ని బట్టే అవకాశాలు వస్తాయి. సన్నీకి ఛాన్స్ లు రావడానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నా.. అంటూ రీసెంట్ గా ఓ షోలో షారూఖ్ పేర్కొన్నారు. దీనిపై సన్నీ స్పందించారు. ‘షారూఖ్ కామెంట్‌తో నేను విస్మయం చెందాను. ఆయనతో నటించే అవకాశం రావడం నా కెరీర్ కి నిజంగా టర్నింగ్ పాయింట్’ అని అన్నారు. గతంలో అమీర్ ఖాన్ కూడా సన్నీతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్నీలియోన్ ‘వన్ నైట్ స్టాండ్’, ‘టినా అండ్ లోలో’, ‘బైమాన్ లవ్’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. బాలీవుడ్‌లోకి అడిగిన దగ్గర్నుంచి సన్నీకి సర్వత్రా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. ఆ ప్రశంసలే ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావడానికి కారణమని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.