Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Sunrisers bowlers prove too much for Royals

By   /  April 10, 2018  /  Comments Off on Sunrisers bowlers prove too much for Royals

    Print       Email

రాజ‌స్థాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* రాణించిన శిఖ‌ర్ రావ‌న్‌
* ఒక్క సిక్స్ కూడా కొట్ట‌య‌ని రాజ‌స్థాన్ ప్లేయ‌ర్స్‌
* రాజ‌స్థాన్ ఖాతాలో మ‌రో చెత్త రికార్డ్‌
డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ కేవలం 15.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లాంఛనాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (57 బంతుల్లో 77; 13×4, 1×6) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ విలియమ్సన్‌(35 బంతుల్లో 36; 3×4, 1×6)తో కలసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సంజు సామ్సన్ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్టార్ ప్లేయర్లు ఆజింక్య రహానే (13), బెన్ స్టోక్స్ (5), జోస్ బట్లర్ (6) నిరాశ పరిచారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఒక్క అంకెకే పరిమితయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబుల్ హసన్, సిద్ధార్థ్ కౌల్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, స్టాన్‌లేక్, రషిద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడలేకపోయారు.
అందరూ కలిసి 12 ఫోర్లు మాత్రమే బాదగా.. రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరైన ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఓ జట్టు ఇన్నింగ్స్ ముగించడం ఇది 11వ సారి కాగా, రాజస్థాన్ రాయల్స్‌కు నాలుగోసారి. ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →