సన్‌రైజర్స్‌ను గెలిపించిన నాయకుడు
ఆయన జట్టుకు కెప్టెన్ మాత్రమే కాదు. కష్టకాలంలో ఆదుకునే ఆపద్భాందవుడు. చివరి వరకు ముందుండి నడిపించే నాయకుడు. విజయం కనుచూపు మేరలో లేదని తెలిసినా పోరాటం ఆపని యోథుడు ఇలా సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ గురించి ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. గుజరాత్ లయన్స్‌తో నిన్న జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో వార్నర్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలుస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. గత రెండేళ్లలో వార్నర్ హైదరాబాద్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి సీజన్లోనూ మిగతా జట్టంతా విఫలమైనా ఒక్కడే పోరాడాడు. ఈ సీజన్లో మిగిలిన వాళ్లు ఫర్వాలేదనిపించినా… చావోరేవో తేల్చుకోవాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సహచరులు మళ్లీ చేతులెత్తేశారు. గుజరాత్ లయన్స్ చేసిన 162 పరుగులు పెద్ద లక్ష్యం కాకపోయినా అందరూ పెవీలియన్‌కు వెళ్తున్నా వార్నర్ పోరాట పటిమతో సన్‌రైజర్స్ 163 పరుగులు చేయగలిగింది. కాగా ఇందులో బిపుల్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ కూడా తోడైంది. బిపుల్ శర్మ లయన్స్ బౌలర్లకు షో చూపెట్టాడు. అతను మూడు సిక్సర్లు బాది ఇంకా 4 బంతులు ఉండగానే సన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ద్వివేది (సి) బౌల్ట్ (బి) భువనేశ్వర్ 5; మెకల్లమ్ (సి) భువనేశ్వర్ (బి) బిపుల్ శర్మ 32; రైనా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 1; కార్తీక్ రనౌట్ 26; ఫించ్ (బి) కటింగ్ 50; స్మిత్ (సి) ధావన్ (బి) కటింగ్ 1; జడేజా నాటౌట్ 19; బ్రేవో (బి) భువనేశ్వర్ 20; ధవల్ కులకర్ణి నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1-7; 2-19; 3-63; 4-81; 5-83; 6-134; 7-158.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-2; బౌల్ట్ 4-0-39-1; బరీందర్ 3-0-28-0; బిపుల్ శర్మ 3-0-21-1; కటింగ్ 3-0-20-2; హెన్రిక్స్ 3-0-27-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ నాటౌట్ 93; ధావన్ రనౌట్ 0; హెన్రిక్స్ (సి) ద్వివేది (బి) స్మిత్ 11; యువరాజ్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 8; దీపక్ హుడా ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 4; కటింగ్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 8; నమన్ ఓజా (సి) జడేజా (బి) బ్రేవో 10; బిపుల్ శర్మ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1-6; 2-33; 3-61; 4-75; 5-84; 6-117.
బౌలింగ్: ప్రవీణ్ 3.2-0-32-0; ధవల్ కులకర్ణి 4-0-32-0; స్మిత్ 2-0-29-1; రైనా 2-0-15-0; కౌశిక్ 4-0-22-2; బ్రేవో 4-0-32-2.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.