విజయాల బాట పట్టిన `సన్ రైజర్స్`
హైదరాబాద్జట్టు సన్‌రైజర్స్ టీం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా చెలరేగి పోతోంది. మొదట్లో కొంచెం తడబడినా చివరకు విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడితే అందులో నాలుగు విజయాలను సొంతం చేసుకుంది. అయితే సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తాడుకున్న యువరాజ్ సింగ్ లేకపోవడం కొంత వరకు అభిమానులను, టీం సభ్యులను నిరుత్సాహ పరిచే విషయమే అని అందరూ కలిసి కట్టుగా ఆడుతూ విజయ బాట పట్టారు. సన్‌రైజర్స్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్స జట్టు బలమూ, బలహీనతగా మారాడు. అద్భుతమైన ఆటతీరుతో నాలుగు అర్ధ సెంచరీలు చేసిన వార్నర్ విఫలమైతే అది జట్టుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నా, గత రెండు ఇన్నింగ్స్‌లలో అతను చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు కానీ అతను క్రీజ్ ఉంటే విజయం సాధిస్తుందని నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అయితే నెహ్రా, ముస్తఫిజుర్, భువనేశ్వర్ ప్రత్యర్థిని అడ్డుకోగల సమర్థులు వీళ్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అయితే నిన్న ఉప్పల్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ చెలరేగిపోయి విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ టీం సభ్యులుమంచి పనితీరును కనబరిచారు. ఏది ఏమైనా సర్‌రైజర్స్ టీం విజయాల బాట పట్టడం తెలుగు క్రికెట్ అభిమానులకు సంతోషకర విషయమే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.