Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Super Response For Kshanam Cinematography

By   /  February 20, 2016  /  Comments Off on Super Response For Kshanam Cinematography

    Print       Email

క్షణం’ మూవీ సినిమాటో గ్రఫి అదుర్స్..

kshanam movie poster2

InCorpTaxAct
Suvidha

సినిమా నిర్మాణంలో సంబంధం ఉన్న అన్ని విభాగాల వారికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అంటే ఎంతో మక్కువ. ఇందులో ప్రపంచం మొత్తం ప్రేక్షకులు చూస్తూండగా.. ఘన స్వాగతం పలికి అవార్డులు అందిస్తారు. వీటిలో ఫుల్ లెన్త్ సినిమా దగ్గర నుంచి షార్ట్ ఫిల్మ్స్ వరకు అన్నీ ఉంటాయి. ఇలాంటి వేడుకకు ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నామినేట్ అయ్యారు షనీల్ డియో. ఆయన అమెరికాలో ఇండిపిండెంట్ సినిమాలకి సినిమాటోగ్రఫి చేశారు. ఇప్పుడు ఆయన తెలుగులో పీవీపీ బ్యానర్ లో నిర్మించిన క్షణం మూవీకి సినిమాటో గ్రఫి చేశారు. అడివి శేష్, అదా శర్మ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో డియో పనితనం ఏంటో అర్ధమవుతోంది. ఆయన షాట్స్ లో తీసిన లొకేషన్లు, ఆర్టిస్టులను చూపించిన విధానం చాలా బాగుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా 26న రిలీజ్ కానుంది. క్షణం మూవీతో షనీల్ డియో మంచి పేరు తెచ్చుకుంటాడని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలో ఆయన ఓ ఫ్రెంచ్ ప్రొడక్షన్ లో పనిచేయనున్నట్లు సమాచారం.

shanil dio

ఈ నెల 26న రిలీజ్ అవుతున్న ‘క్షణం’ సినిమాలో అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ నటించారు. స్టొరీ : అడివి శేష్, ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరేపు, సినిమాటోగ్రఫీ : షనిల్ డియో, సాహిత్యం : సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి, నిర్మాత : పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం : రవికాంత్ పెరేపు

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →