Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Supreme Court issues notice to Vijay Mallya, seeks reply in two weeks..

By   /  March 9, 2016  /  Comments Off on Supreme Court issues notice to Vijay Mallya, seeks reply in two weeks..

    Print       Email

vijay malyaవిజయ్ మాల్యాకు సుప్రీం నోటీసులు..

 

InCorpTaxAct
Suvidha

దేశం విడిచి వెళ్లవద్దంటూ కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాను ఆదేశించాలంటూ ఎస్‌బీఐ సహా 17 బ్యాంకులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేతకు పాల్పడ్డారని తెలిపాయి. మాల్యా విదేశాలకు వెళితే కేసు నీరుగారి పోతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అయితే విజయ్ ఇప్పటికే దేశం వదలివెళ్లారని సీబీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఆయన లండన్‌లో ఉండి ఉంటారని భావిస్తున్నారు. మాల్యా ఎక్కడున్నారనే విషయాన్ని ఆయన కార్యాలయం కూడా వెల్లడించడంలేదు. మాల్యా చెల్లించాల్సిన సుమారు రూ.7వేల కోట్లను రికవరీ చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నాలు చేపట్టాయి.

పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. విజయ్‌ మాల్యాకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులను మాల్యాకు ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు. లండన్‌లోని భారత హైకమిషనర్‌కు, సిబ్బందికి నోటీసులను మెయిల్‌ చేశారు. మాల్యా లండన్‌లో ఉన్నాడని అధికారులు భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →