బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రేపే తీర్పు..
బాబ్రీ మసీదు కేసులో బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో బీజేపీ నేతలు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారంటూ నమోదు అయిన అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇక ఈ తీర్పును అలహాబాద్ హై కోర్టు కూడా సమర్ధించింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసుపై మరోసారి విచారణ జరపాలని కోరింది.
బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలువురిపై అభియోగాలు ఉన్నాయి.దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై జస్టిస్ రోహింగ్టన్ ఎఫ్ నారిమన్ తీర్పును వెలువరించనున్నారు. నేరపూరిత కుట్ర అభియోగాలపై తిరిగి విచారణ జరపాలా వద్దా అన్న దానిపై ఈనెల 6న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఇదిలాఉంటే.. సాంకేతిక అంశాల కారణంగా అభియోగాలు ఉన్న వారిపై కేసులను తొలగించేందుకు అంగీకరించమని సుప్రీంకోర్టు పేర్కొంది. అవసరమైతే వారు మరోసారి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.