Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Supreme Court Notice to Assembly Speaker

By   /  August 18, 2016  /  Comments Off on Supreme Court Notice to Assembly Speaker

    Print       Email

index_supreme_court__32775fస్పీక‌ర్‌కు నోటీసులు

 

InCorpTaxAct
Suvidha

 

ఒక పార్టీగుర్తుపై గెలిచి మ‌రొక పార్టీలోకి వెళ్లిన వారిపై తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో ఫిరాయింపుల వ్య‌వ‌హారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ విషయంలో స్పీకర్ తో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకొనేలా స్పీకర్ కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి 22 నెలలు కావస్తున్నా స్పీకర్ ఇంత వరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్ తన్కా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్‌కు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు మరో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని గతంలో వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కోర్టు సానుకూలంగా స్పందించి నోటీసులు జారీ చేసింది’’ అని తెలిపారు. ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబె ల్లి దయాకర్‌రావు (టీఆర్‌ఎస్‌లో చేరక ముందు) దాఖలు చేసిన పిటిషన్ కూడా కలసి ఉండడంతో అందరికీ నోటీసులు జారీ కానున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →