నిజంగా వింతే!
ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ అన్ని అవయవాలతో పుట్టాలనికోరుకుంటారు. కానీ అప్పుడప్పుడు జన్యు లోపాలతో కొన్ని అవయవాలు లేకుండా పుట్టడం చూశాం. అయితే ఇప్పుడు చెప్పే శిశువు గురించి చెబితే నిజంగానే ఆశ్చర్య పోతారు. మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఒక మహిళ నాగపూర్లోని లతామంగేష్కర్ ఆస్పత్రిలో ఇటీవలే ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే చర్మం లేకుండా.. తెల్లటి పొడలతో.. ఎర్రటి నోరు.. ముక్కుల స్థానంలో రెండు రంధ్రాలతో, బల్బుల్లాంటి కళ్లతో, చెవులు అసలే లేకుండా.. గ్రహాంతరవాసిలా ఉన్నాడు. జన్యుపరమైన లోపాలతో పుట్టే ఇలాంటి బిడ్డలను ‘హార్లెకిన్ బేబీ’ అంటారని డాక్టర్లు అంటున్నారు. అయితే మనదేశంలో ఇలాంటి శిశువులు ఇంతకుముందు కూడా పుట్టిన దాఖలాలు ఉన్నాయని.. 1750 నుంచి ఇలాంటి శిశుజననాలు దాదాపు డజనుకు పైగా రికార్డుల్లో నమోదయ్యాయని పేర్కొంటున్నారు.
1750 నాటి నుంచి నమోదైన ఈ రికార్డులను పరిశీలిస్తే.. ఆ ఏడాది ఏప్రిల్లో అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఇలాంటి ఒక శిశువు జన్మించింది. అలాగే పాకిస్థాన్లో ఒక మహిళకు నలుగురు పిల్లలు ఇలాగే పుట్టి చనిపోయారు. సౌతాఫ్రికాలో మాత్రం ఒక చిన్నారి ఇలాగే పుట్టి చక్కగా ఉన్నాడు. కాగా.. చూపు కూడా లేకుండా జన్మించిన ఈ పాపను ప్రస్తుతం ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని.. ఈ శిశువు బతికే అవకాశాలు దాదాపు లేవని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచానికి వింతే అయినా జన్మనిచ్చిన తల్లులకు మాత్రం గర్భశోకాన్ని మిగిలిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.