Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Surya 24 Movie Audio Launch on April 11

By   /  April 5, 2016  /  Comments Off on Surya 24 Movie Audio Launch on April 11

    Print       Email

surya

ఏప్రిల్ 11న సైన్స్ ఫిక్షన్ మూవీ ’24’ సాంగ్స్ రిలీజ్..

InCorpTaxAct
Suvidha

 

 

 

అరవ యాక్టర్ సూర్యా విభిన్నమైన సినిమాలు చేస్తాడనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు ఎంచుకుంటారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ 24లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ సినిమా పాటలను ఏప్రిల్ 11న హైదరాబాద్ శిల్పా కళా వేదికలో రిలీజ్ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో సూర్య, సమంత, నిత్యామీనన్, విక్రమ్ కుమార్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ కూడా పాల్గొననున్నారు. ఈ ఆడియో వేడుకకు పలువురు తెలుగు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్‌, కాలం నా ప్రేయసి అనే పాటకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ బరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫి – కె.తిరునాపుక్కరసు, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైన్ – అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి, పాటలు – చంద్రబోస్ మరియు శాంక్ వెన్నెలకంటి, సౌండ్ డిజైన్ – లక్ష్మీ నారాయణన్, సౌండ్ ఎఫెక్ట్స్ – ఇక్బాల్, యాక్షన్ – అన్బరివ్, కొరియోగ్రఫీ – రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జులియన్ ట్రౌసెల్లియర్, మేకప్ – క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్, కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా, స్టిల్స్ – ఆర్.వెంకట్రామ్ పబ్లిసిటీ డిజైన్ – రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్, పి.ఆర్.ఓ – ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →