Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Surya Jump On Gate Pics Viral On Social Media

By   /  January 17, 2018  /  Comments Off on Surya Jump On Gate Pics Viral On Social Media

    Print       Email

గేటు దూకేసిన సూర్య.. సోషల్ మీడియాలో హంగామా..!

 

InCorpTaxAct
Suvidha

 

తమిళ హీరోనే అయినా తెలుగులో సూర్య తన సోదరుడు కార్తిలకు మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య గజినితో ఇక్కడ స్టార్ అయిపోయాడు. సంక్రాంతి బరిలో సూర్య నటించిన గ్యాంగ్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మిగతా సినిమాలు కూడా అలానే ఉండటంతో కలక్షన్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.

ఇందులో భాగంగా రాజమహేంద్రవరం వెళ్లిన సూర్య అక్కడ అభిమానుల తాకిడిని తట్టుకోలేక థియేటర్ వెనుక గేటు నుండి దూకి బయటపడాల్సి వచ్చింది. హీరో వస్తున్నాడు అంటే ఆమాత్రం క్రేజ్ ఉండటం కామనే. అయితే థియేటర్ ముందు గేటు రద్దీగా ఉండటంతో సూర్య చేసేదేం లేక వెనుక గేటు నుండి ఫ్యాన్స్ కంట పడకుండా దూకేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ అటు కూడా ఉండగా వారు ఆ దృశ్యాన్ని వీడియో, ఫోటోలు తీశారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్య గేటు దూకిన పిక్స్ హడావిడి చేస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →