కామన్వెల్త్లో సుశీల్ కుమార్ హ్యాట్రీక్
* వరుసగా మూడోసారి స్వర్ణ పతకం
* బోథాను 80 సెకన్లలో మట్టి కరిపించిన సుశీల్
* 14కు చేరిన స్వర్ణాల సంఖ్య
డెక్కన్ అబ్రాడ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. కామన్వెల్త్ 8వ రోజు భారత రెజర్ల హవా కొనసాగింది. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకొని సత్తా చాటాడు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చాడు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను 80 సెకన్లలోనే మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి భారత్ స్వర్ణాల సంఖ్యని 14కు చేర్చాడు. కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ మొత్తం 7 పతకాలు గెలుచుకోగా.. అందులో రెజ్లింగ్‌లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు వచ్చాయి. తొలుత రెజ్లర్ రాహుల్ ఆవరే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించించాడు. రాహుల్ ఫైనల్లో కెనడాకు చెందిన టకహా షిని మట్టికరిపించి పసిడి కైవసం చేసుకున్నాడు. స్వర్ణం గెలుచుకున్న రాహుల్ జాతీయ గీతం ఆలపించే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు.
అంతకుముందు రాహుల్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2011 కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం దక్కించుకున్న సంగతి తెలిసిందే. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్లో పోటీపడిన బబిత కుమారి ఫొగట్ రజత పతకాన్ని సాధించింది. మరో వైపు మహిళల 76 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన కిరణ్ కాంస్య పతకాన్ని గెలుపొందింది. మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. కావున్వెల్త్ గేమ్స్‌లో 8వ రోజైన గురువారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో పోటీపడిన షూటర్ తేజస్విని సావంత్ మెరుగైన ప్రదర్శనతో రజత పతకం గెలుపొందింది. 2006 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి రెండు బంగారు పతకాలు అందించిన తేజస్విని 2010లో కాంస్య పతకంతో మెరిసింది.
పతకాల పట్టిక
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
ఆస్ట్రేలియా 63 46 47 156
ఇంగ్లండ్ 28 32 27 87
ఇండియా 14 7 10 31
కెనడా 12 29 19 60
దక్షిణాఫ్రికా 11 9 12 32
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.