రాజస్థాన్ లో పాక్ గూఢచారి అరెస్ట్..!
రాజస్థాన్ లో కలకలం రేగింది. దీనికి కారణం పాక్ గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నందలాల్ మహారాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లుగా అధికారుల వెల్లడించారు. అతడు ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే.. నందలాల్ సరైన పాస్‌పోర్ట్, వీసాలతోనే ఇండియాలోకి ఎంటర్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న మునాబో ప్రాంతం చెక్‌పోస్ట్ నుంచి.. సాధారణంగానే భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. జైసల్మేర్ సరిహద్దులో ఉండే 350 గ్రామాల్లోని.. ఓ గ్రామంలో నందలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దులోని ఆ ప్రాంతాల్లోకి విదేశీయులకు ఏ మాత్రం అనుమతి ఉండదు. భారతీయులు కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే.ప్రస్తుతం నందలాల్పై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.