Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

టీడీపీ గూటికి మ‌రో ఎమ్మెల్యే!

By   /  May 5, 2016  /  Comments Off on టీడీపీ గూటికి మ‌రో ఎమ్మెల్యే!

    Print       Email

sv mohan reddyవైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి వ‌ల‌స‌లు ఇప్ప‌ట్లో ఆగేట‌ట్లు క‌నిపించ‌డం లేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్ వెంట తామంతా ఉంటామంటూ చెబుతూనే పార్టీ మారుతున్నారు. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ ఎవ‌రిని న‌మ్మాలా.. ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.  తాజాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. తెలుగు దేశం పార్టీలో చేర‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్లే న‌ని మోహ‌న్ రెడ్డి స‌న్నిహితులు అంటున్నారు. కాగా త‌న బావ భూమానాగిరెడ్డి ఇటీవ‌ల  టీడీపీలో చేర‌డంతో ఆయ‌న కూడా చేర‌తాడ‌ని అంతా భావించారు. కానీ అప్పుడు వెళ్ల‌కుండా ఇప్పుడు వెళ్తున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ స‌ర్కార్ నీళ్ల‌ను దోచుకుంటోంద‌ని, దానికి వ్య‌తిరేకంగా క‌ర్నూలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిరాహార దీస్తున్న‌ట్లు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే త‌న‌తో ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా ప్ర‌క‌టించ‌డంపై ఎస్వీ మోహ‌న్ రెడ్డి మ‌న‌స్తాంపం చెందిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా త‌న మేన‌కోడలు అఖిల‌ప్రియ‌పై త‌న బంధువుల‌ను పోటీకి నిల‌బెట్ట‌మ‌ని జ‌గ‌న్ కోరాడ‌ని, అది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ మారాల‌నుకుంటున్న వారంతా ఏదో వంక చూపి వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →