తెలంగాణకు బంగారు భవిష్యత్
భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం అంగరంగా వైభవంగా జరిగింది. బోనాల తర్వాత రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని భవిష్యత్తును చెప్పిన స్వర్ణలత, తెలంగాణ భవిష్యత్తు బంగారమని, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని, ఎవరికి ఆపద రాకుండా తాను చూసుకుంటానని స్వర్ణలత అన్నారు. ‘మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను ఈ సందర్భంగా నిలదీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగాయని మాతంగి స్వర్ణలత వెల్లడించారు.
వానలు కురిపించి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు’ అని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. చివరగా నేనేమీ వెజిటేరియన్ను కాదు కదా అంటూ తనకి నాన్వెజ్ తినిపించాలని సూచించింది. మరోవైపు లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమమైన భవిష్యవాణిని వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.