Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Swatch Hyderabad?

By   /  August 5, 2016  /  No Comments

    Print       Email

How can it be the out come/ result of Swatch Hyderabad ? Even after the govt spending huge amount of money & putting lot of efforts .. I am worried & humbly request govt to take necessary action at the earliest! 13907084_888116124625540_6279927393577422709_n
At Jubilee Hills Road No 86 to Hakeempet Tolichowki connecting Road behind Apollo Hospital after Hakeem baba Dargha..

ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 86 (అపోలో హాస్పిటల్ వెనక, కొండ పైన ఉన్న హకీమ్ బాబా దర్గా నుండి టోలిచౌకి కి కనెక్ట్ అయ్యే దారి)
గత రెండు నెల్ల నుండి ఫిలిం నగర్ వెళుతుండగా నేను రోజు చూసే దృశ్యాలు. మొదలే వర్ష కాలం, బోలెడంత ఈ చెత్త, దారెంబడి కంపు వాసన, పుష్కలంగా దోమల ఉత్పత్తి , అక్కడ నివసించేవారు అనారోగ్యానికి పాలవ్వుడు ఖాయం! ఈ రోజు పక్కన కార్ ఆపి మరి పరిశీలించాను. అంతకముందు ఆ ప్రదేశంలో చెత్త కుండీలు ఉండేవి. వాటిని తొలగించేసారు. అక్కడే ఉన్న ఒక సఫాయి సిబ్బందిని అడిగితె, ప్రభుత్వమే చెత్త కుండీలను తొలగించి ఇంటింటా చెత్తను సేకరిస్తోందని చెప్పాడు. ఇంటింటా వెళ్లి మరి చెత్తను తీసుకెల్లితే, అక్కడున్న ప్రజలు రోడ్ ప్రక్కన యాడపడితే ఆడ చెత్త ఎందుకు వేస్తున్నారు? ప్రభుత్వం ఈ ప్రదేశంలో నిఘా పెట్టి ప్రజలకు చెత్త ఎక్కడేయాలో, లేదా వారి ఇండ్లల్లో కివెళ్ళి చెత్త బట్టలిచ్చి వారిని చైతన్య పరిస్తే మంచిది. చెప్పినా వినకుండా యాడపడితే ఆడ చెత్త వేసే వారిని దొరకపట్టి వారికి జరిమానావేసి శిక్ష విధించనంత వరకు మన పట్టణములో ఇలాంటి ఇరువైపులా చెత్తతో అలంకరించబడ్డ రోడ్లను చూస్తూనే ఉంటాము. అన్నన్ని కోట్ల ధనాన్ని ఖర్చుపెట్టి స్వత్చ్ భరత్ స్వత్చ్ హైదరాబాద్ అనే కార్యక్రమాలు చేపట్టి ఏంలాభం? గతంలో స్వత్చ్ హైదరాబాద్ అంటూ చీపుర్లతో ఊడుస్తూ ఫోటువలు దిగిన ప్రముఖులకు ఇప్పుడు ఈ రోడ్లు కనపడడం లేదా? లేదా స్వత్చ్ భరత్ ప్రోగ్రాం ఖతం అయ్యి హరితహారం ప్రోగ్రాం జోష్ల నిమగ్నమై (ట్రీ గార్డ్లు లేకుండానే) మొక్కలు నాటే ఫోటోసెషన్లో బిజీ ఉన్నారా ? ఏంతో మంచి ఉద్దేశాలతో మొదలుపెట్టే ప్రతి కార్యక్రమం ఎల్లకాలం నడవాలి కానీ ఒక నెలవరకే పరిమితం కాకూడదు . అది పరిశుభ్రత ఐన మొక్కలు నాటి వాటి సంరక్షణ ఐన ! వీటిని నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనది కూడా! – రఫీ

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →