`స్విస్ ఛాలెంజ్` సర్కార్కు సవాల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విస్ ఛాలెంజ్ వ్యవహారంలో చాలా మొండిగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. `స్విస్ ఛాలెంజ్` పద్ధతిని ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తున్న బాబు పట్టించుకోకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దీంతో మునుముందు ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రభుత్వం చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తాజాగా ముగిసిన మంత్రివర్గ సమావేశంలో స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అందులో ఏ మంత్రి కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అంతా వన్ సైడ్ వెర్షనే..అధికారులతో ప్రజంటేషన్ ఇప్పించి..మాట్లాడుకున్నాం..కదా అయిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రకటించి కొత్త ఏజెండాలోకి వెళ్ళిపోయారు. అక్కడే అసలు విషయం ఉంది. స్విస్ ఛాలెంజ్ లోని నిబంధనలపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
అవేమిటి అంటే ‘ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పుకు ప్రభుత్వం ఎలా గ్యారంటీ ఇస్తుంది. అయినా మన భూమి తనఖా పెట్టి అప్పు తెచ్చుకునే వాళ్ళకు మనం గ్యారంటీ ఎందుకు ఇవ్వాలి. రిస్క్ ఎవరిదైనా మనమే ఎందుకు భరించాలి. అప్పుకు గ్యారంటీ అంటే ఎఫ్ ఆర్ బీఎం నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ నిబంధనలు అన్నీ రాష్ట్ర ఖజానాపై భారీగా భారం మోపుతాయి’ అని ఆర్థిక శాఖ అధికారులు విస్పష్టంగా పేర్కొన్నారు. మంత్రివర్గం మాత్రం సింగపూర్ సంస్థలు ఇచ్చిన స్విస్ ఛాలెంజ్ ను ఆమోదించాయి. ఇఫ్పుడు మంత్రివర్గ తీర్మానాలు వస్తే కానీ అసలు విషయం ఏమి జరిగిందో తెలియదు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేసి సర్కారు ముందుకెళ్లిందా?? వెళితే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.