Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

T.A.T.A New Jersey Bathukamma Celebrations

By   /  October 2, 2017  /  No Comments

    Print       Email
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్  న్యూజెర్సీ  బతుకమ్మ సంబురాలు
న్యూజెర్సీ, సెప్టెంబర్ 26, 2017 :
తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ దసరా సంబురాలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆధ్వర్యం లో ఘనంగా జరిగాయి. కని విని ఎరుగని రీతిలో జనం తండోప తండాలుగా ఐస్ లిన్ లోని మెర్రిల్ పార్కుకు తరలి వచ్చారు. సుమారు 1800 మంది మహిళలు మరియు పిల్లలు బోనాలతో, పెద్ద బతుకమ్మలతో, చిన్న బతుకమ్మలతో మధ్యాహ్నం12 గంటలకి పార్కు కి తరలి వచ్చారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీ కార్య వర్గం ప్రాంతీయ ఉపాధ్యక్షులు గంగాధర్ ఉప్పల, సతీష్ మేకల,  కో ఆర్డినేటర్స్ నీలిమ బోనగిరి, శ్రీ రెడ్డి ఆల్గొండ, జ్యోతి మల్లాది, శ్యామ్ బోనగిరి, కావ్య కొల్ల, శివ కొల్ల మరియు శ్రీనివాస్ రెండు నెలలు శ్రమించి పండుగకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో పార్కు ముందుకు చేరుకొని డప్పులతో గౌరమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు. వివిధ రకాల పూలతో అలంకరించిన షుమారు 500 పెద్ద, చిన్న బతుకమ్మలను గౌరమ్మగ కొలిచారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైసరి చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పైళ్ల మల్లారెడ్డి మరియు శ్రీమతి సాధనరెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన కావించారు. బతుకమ్మ పండుగకి తరలి వచ్చిన అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి సంవత్సరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, న్యూజెర్సీ  వారు నిర్వహించే బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసారు. ఇక ముందు కూడా తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు అద్దం పట్టే దసరా పండుగ అమెరికా దేశం మొత్తం టాటా నిర్వహిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన డా” విజయపాల్ రెడ్డి, టాటా అడ్వైసరీ సభ్యులు మాట్లాడుతూ ఇసుకేస్తే రాలనంత జనం ఒక్క తెలంగాణ పండుగలల్లనే కనపడ్తదని అది ఈరోజు రుజువైందని అన్నారు. టాటా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మీరు అందరూ పాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలని తెలియజేసారు. తెలంగాణ పూల పండుగ గొప్పతనాన్ని సంస్కృతిని తెలుసుకుని గౌరవ అతిధిగా విచ్చేసిన న్యూ జెర్సీ ఎడిసన్ రిపబ్లిక్ మేయర్ అభ్యర్థి కీత్ మాట్లాడుతూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఇంత గొప్ప పండుగకి ఇన్ని వేల మందికి నిర్వహించటం మెచ్చుకోదగినదని అంత కలిసుండాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
డా” మోహన్ పట్లోళ్ల, టాటా  అడ్వైసరి సభ్యులు మాట్లాడుతూ, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. షుమారు రెండు వేల మంది మనం జరువుకునే బతుకమ్మ పండక్కి రావటం బహుశా న్యూ జెర్సీ లో ఇదే మొదటిసారి అని ప్రశంసించారు. ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో  సాధ్యమయ్యేది కాదని దీనికి టాటా మొత్తం ఎంతో శ్రమించిందని వారిని కొనియాడారు. ముఖ్యంగా న్యూ జెర్సీ టాటా టీం బాగా కష్టపడ్డారని తెలియజేసారు. డా” రామిరెడ్డి మల్లాది, అనుబంధ కార్యదర్శి, టాటా, మాట్లాడుతూ ఒక గొప్ప అధ్యాయాన్ని న్యూజెర్సీ ఆవిష్కరించిందని, ఇంతవరకు బతుకమ్మ, దసరా పండుగలకు ఇంత జనం రావటం ఇదే ప్రథమం అని చెప్పారు. ఇది తెలంగాణ వారికీ తెలుగు వారికీ వారి పండుగలపై ఉన్న అపార విశ్వాసం మరియు ప్రేమానురాగాలని అన్నారు.ఇక నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బతుకమ్మ మరియు సంబరాలు జరుపుతమని తెలియజేసారు. ఈ సందర్బంగా టాటా అడ్వైసరి సభ్యులు డా” హరినాథ్ పొలిచెర్ల, డా” సుధాకర్ విడియాలా మరియు శ్రీనివాస్ రెడ్డి అనుగు న్యూ జెర్సీ టాటా కుటుంబానికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసారు.
టాటా అధ్యక్షులు శ్రీమతి ఝాన్సీ రెడ్డి కాలిఫోర్నియాకెళ్ళి ఫోనులో మాట్లాడుతూ అమెరికా దేశమంతటా వివిధ రాష్ట్రాలలో బతుకమ్మ మరియు దసరా సంబురాలు అట్టహాసంగ జేస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నిటికి చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు మరియు కావాల్సిన ఏర్పాట్లు నాలుగు నెలల నుండి టాటా కుటుంబం అంత తెలియజేసారు. బతుకమ్మ మరియు దసరా సంబరాల కార్యక్రమాన్ని తన వెన్నంటే ఉండి నడిపిస్తున్న టాటా అడ్వైసరి కి మరియు కార్యవర్గ ఉపాధ్యక్షులు భరత్ మదాడి, కార్యదర్శి విక్రమ్ జంగ, కోశాధికారి మహేష్ ఆదిభట్ల లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఇంత అట్టహాసంగా జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూ జెర్సీ బతుకమ్మ సంబరాలలో కృష్ణుడి వేషాలు, బోనాలు, డప్పులు, బతుకమ్మ ఆట పాటలతో సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో టాటా సభ్యులు శ్రీమతి సాధన రెడ్డి, శ్రీమతి శైలజ రెడ్డి, శ్రీమతి గీత రావు, శ్రీమతి జ్యోతి మల్లాడి, శ్రీమతి డా” అరవిందా రెడ్డి, గంగాధర్ ఉప్పల, సరితా ఉప్పల, సతీష్ మేకల, నరసింహ రెడ్డి దొంతిరెడ్డి,  కో ఆర్డినేటర్స్ శ్యామ్ బోనగిరి, నీలిమ బోనగిరి, జై , శ్రీ రెడ్డి ఆల్గొండ, శివ రెడ్డి కొల్ల, నవ్య కొల్ల, శ్రీనివాస్, జ్యోత్స్నా పెంటవెళ్లి మరియు, ఇతర తెలుగు సంస్థల నుండి శ్రీ హరనాథ రెడ్డి, ఆటా అడ్వైసరి చైర్, శ్రీ గాదె గోపాల్ రెడ్డి ఆటా అడ్వైసరి సభ్యులు, శ్రీ కరుణాకర్ మాధవరం, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చైర్, మరియు ధన రాజ్ శేరి, రామ్ మోహన్ రెడ్డి, విలాస్ జంబుల, మధు యాష్కీ గౌడ్, కాంగ్రెస్ నాయకులు,  శ్రీధర్ చిల్లర గారు పాల్గొన్నారు.
Telangana American Telugu Association (T.A.T.A) grand Bathukamma celebrations in New Jersey:
Edison, September 25, 2017: Telangana American Telugu association (T.A.T.A), set the trend with huge crowd with more than 2000 women in New Jersey this Saturday at Merrill Park. They were all gathered for the T.A.T.A BATHUKAMMA FESTIVAL, the traditional floral festival of India, especially in Telangana. Bathukamma, the Goddess Gouramma illustrate the divine of Telangana, culture of Telugu women and tradition of festivals by praying Durga Devi, goddess of Happiness. T.A.T.A. New Jersey RVPs Sathish Mekala and Gangadhar Uppala, Regional Coordinators Shyam Bonagiri, Neelima Bonagiri, Shivareddy Kolla, Navya Kolla, Srinivas, Prasanna, Bhanu and Jyothsna spent restless two months to make the arrangements for this Big gathering. By noon on Saturday at Merrill park entrance hundreds of women and children gathered with Bonalu, Big Bathukamma and Dappulu. The Assembly of Telangana women set up Gouramma and more than 500 bathukammas at one place and worshipped Gouramma.
Dr. Pailla Malla Reddy, T.A.T.A advisory chair and Chief guest attended with his family Smt. Sadhana Reddy Garu for this festival celebration wished the crowd and said BIG thanks to the devotees of Bathukamma for gathering here to celebrate our Telangana festival. It’s always happy to serve the people for needy and arrange the requirements to run the event smoothly. Dr. Reddy said to the media that Its been years we are celebrating in New Jersey and every year the crowd doubles and this time is more than what we expected. We took the necessary arrangements well advance and he congratulated the team for the successful arrangements. Dr. Mohan Patlolla, T.A.T.A advisory member expressed big thanks and Bathukamma and Dasara festival wishes to the Telangana and Telugu community. Dr. Patlolla also thanked VIP guest Mr. Keith Hawn, Edison republican mayor candidate to come here and aspire to know about our Telangana culture and tradition.
Dr. Vijaypal Reddy, T.A.T.A advisory member and guest of honor attended with his family. He spoke to the media “Bathukamma festival is one of the major festival in Telangana and telanganites has the special tradition that we worship flowers as gods.  He expressed sincere thanks to the organizers for having him and applauded that made wonderful arrangements for the huge crowd. Dr. Ram Reddy Malladi, Jt. Secretary thanked the entire team for their hard work to run the festival smoothly. He mentioned RVPs Satish Mekala  and Gangadhar Uppala and RCs worked day and night at least two months to gather this big crowd and it’s the highest crowd with two thousand women and children in New jersey Bathukamma celebrations history. Dr. Harinath Policherla Advisory Committee Co-Chair of T.A.T.A. Dr. Sudhakar Vidiyala and Mr. Srinivas Reddy Anugu sent their wishes to the New Jersey telanganites.
T.A.T. A President Smt. Jhansi Reddy over the phone wished the crowd from California. She was very humble to explain the festival history. “Bathukamma is the floral festival. The flowers such as Thangedu, Gunugu, ponna, banthi, chamanthi has great values in medicine. These flowers were gifted by goddess Gouramma considered as Telangana Pedhamma to take of our children. She also mentioned Telangana American Telugu association celebrating Bathukamma and Dasara Jathara across the nation. It’s happening with the great support of executive committee Bharat Madadi EVP, Vikram Jangam Secretary, Mahesh Adhibatla Treasurer, Anil Arrabelli Jt. Treasurer and Rama Malladi Jt. Secretary. President Expressed her sincere thanks for their great support.
 T.A.T.A New Jersey organizers conducted special programs in this festival day such as; Best Bathukamma making contest, Kids speech about Bathukamma history, Dance performances, singing Bathukamma songs and Srikrishnudu. All the particpants got trophy and certification. Before mangala harathi of gouramma, organizing committee announced prizes to the winners and distributed.  In this huge festive crowd, T.A.T.A team Smt. Sadhana Reddy, Smt. Shialaja, Smt. Dr. Aravindha Reddy, Smt. Jyothi Malladi, T.A.T.A RVPs Gangadhar Uppala, Satheesh Mekala, RCs Shyam Bonagiri, Neelima Bonagiri, Jai, Sree Reddy Algonda, Shiva Reddy Kolla, Navya Kolla, Narasimha Reddy Donthireddy and Shri. Haranath Reddy, ATA advisory chair, Sri. Gade Gopal Reddy, ATA advisory member, Sri. Karunakar Madhavaram American Telangana Association Chair, Dhan Raj Sheri, Rama Mohan Reddy, Madhu Yashki Goud, Congress Ex M.P., Sreedhar Chillara and Vilas Jambula participated.
——————————————————————————————————–
If you like to publish your organization or any community news, please send email to editor@deccanabroad.com
We will publish on our website www.deccanabroad.com it will goto Facebook and Twiiter instantly.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →