Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

T.Subbarami reddy going to join YSRCP?

By   /  August 17, 2016  /  Comments Off on T.Subbarami reddy going to join YSRCP?

    Print       Email

SubbiramiReddyవైసీపీలోకి టీఎస్ఆర్‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ పార్టీకి వీర‌విధేయుడిగా పేరు పొందిన టి.సుబ్బ‌రామిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీలోకి వ‌స్తున్నారా? టీఎస్ఆర్‌ను వైసీపీలోకి తెచ్చేందుకు ఓ స్వామీజీ బాధ్య‌త తీసుకున్నారా? అంటే అవున‌నే అంటున్నారు విశాఖ ప్ర‌జ‌లు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న‌ట్లుగా విశాఖ జిల్లాలో భారీగా సీట్లు గెలుచుకోవాల‌ని వైసీపీ వ్యూహం ర‌చిస్తోంది. ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టి.సుబ్బ‌రామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని కూడా అనుకుంటోంది. అయితే  జ‌గ‌న్‌కు సుబ్బ‌రామిరెడ్డికి మ‌ధ్య అంతగా రాజకీయ చర్చలు జరిపే ఫ్రెండ్ షిప్ లేదు. దీంతో గత కొన్నాళ్లుగా తనను చేరదీసి – సలహాలు – సూచనలు ఇస్తున్న ఆధ్యాత్మిక గురువు స్వరూపానంద స్వామి రంగంలోకి దిగారని సమాచారం. సుబ్బరామిరెడ్డికి – జగన్ కు చెలిమి కుదిరేలా ఆయన రాయబారం నిర్వహిస్తున్నారట. ఇది గనక వర్కవుట్ అయితే.. తిక్కవరపు హస్తానికి గుడ్ బై చెబుతారనే టాక్ నడుస్తోంది.

అయితే ఇక్కడ ఆలోచించాల్సి విషయం ఏంటంటే.. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న తిక్కవరపు అంత తేలిగ్గా.. సోనియమ్మను వదిలేసి వచ్చేస్తారా? అనేది ప్రశ్న. అందునా.. వచ్చే దఫా అయినా.. అధికారంలోకి వస్తాడో రాడో అనే డౌట్ లో ఉన్న జగన్ పార్టీ కోసం ఆయన అంత త్యాగం చేస్తాడా? అనేది కూడా ప్రశ్నే. ముచ్చటగా మూడో సందేహం ఏంటంటే.. సుబ్బరామిరెడ్డికి ఏపీ సహా హైదరాబాద్ – ముంబై – ఢిల్లీల్లో హోటళ్లు – వ్యాపారాలు తెగ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ అతిపెద్ద జాతీయ పార్టీని విడిచి పెట్టి.. ఓ చిన్నప్రాంతీయ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? ఏమో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →