Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Kusal Perera’s assault helps Sri Lanka hunt down 175

By   /  March 6, 2018  /  Comments Off on Kusal Perera’s assault helps Sri Lanka hunt down 175

    Print       Email

కుర్రాళ్లు ఓడారు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* టి20లో శ్రీ‌లంక బోణీ
* ధావ‌న్ మెరిసినా ఫ‌లితం శూన్యం
డెక్క‌న్ అబ్రాడ్‌: నిధాస్ కప్ ముక్కోణపు టి20 తొలి మ్యాచ్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. శిఖర్ ధావన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసి ఐదు వికెట్ల విజయం అందుకుంది. 175 రన్స్ భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ మెండిస్ త్వరగా ఔటనప్పటికీ గుణతిలక ధాటిగా ఆడాడు. కుశాల్ పెరీరాతో కలసి రెండో వికెట్‌కు 70 రన్స్ జోడించాడు. 19 పరుగులు చేసిన గుణతిక అవుటయ్యాక పెరీరా – చండీమాల్‌తో కలసి స్కోరుబోర్డును పరుగులెత్తించారు. పదిఓవర్లలోనే లంక స్కోరును 100 పరుగులు దాటించారు. కెప్టెన్ చండీమాల్, తరంగ వికెట్లుత్వరత్వరగా కోల్పోయినా తిశరా పెరీరా, దుషాన్ శణకలు భారత బౌలర్లనుధీటుగా ఎదుర్కొని జట్టును విజయపధాన నడిపించారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90 పరుగులు చేసి శ్రీలంక ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంకలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఇదే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఇప్పుడు ఆ రికార్డును ధావన్ అధిగమించాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →