Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TADA court ruled in the Mumbai serial blasts case

By   /  June 16, 2017  /  Comments Off on TADA court ruled in the Mumbai serial blasts case

    Print       Email

ముంబై వరుస పేలుళ్ల కేసులో తీర్పునిచ్చిన టాడా కోర్టు..

 

InCorpTaxAct
Suvidha

 
ముంబై వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు శుక్రవారం కీలక తీర్పును ఇచ్చింది. పేలుళ్ల వెనకున్న ప్రధాన సూత్రధారి ముస్తఫా దోస్సాను ప్రధాన కుట్రదారుగా న్యాయస్థానం నిర్ధారించింది. ముస్తఫాతో పాటు అబూసలేం సహా మరో ఐదుగురిని టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. మిగిలినవారిలో ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, అబ్దుల్ ఖయ్యూం, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ తక్లా, కరీముల్లాఖాన్ లు ఉన్నారు.

1993 మార్చి 12న ముంబైలో ఏకంగా 12 ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 257 మంది దుర్మరణం చెందారు. మరో 715 మందికి గాయపడ్డారు. దావూద్ గ్యాంగ్ పాల్పడ్డ ఈ పేలుళ్లలో అబూసలేం, ముస్తఫా ప్రధాన పాత్రను పోషించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నారు. పేలుళ్లలో తమ పాత్ర ఏమీ లేదని అబు సలేం అన్నాడు. కేవలం ఆయుధాలను మాత్రమే సరఫరా చేశామని చెప్పాడు. కోర్టు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. నిందితులందరినీ వేర్వేరుగా విచారించిన న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →