Loading...
You are here:  Home  >  'పూవులేల పూజసేయ..భక్తి సుమము చాలునుగా..!'
Latest

Telugu Ghazal: విమర్శించు తత్వమేల

By   /  August 4, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Ghazals, Telugu Poetry  /  No Comments

పూవులేల పూజసేయ..భక్తి సుమము చాలునుగా..! పట్టుపుట్ట మది ఏల..తలపు పట్టు చాలునుగా..! శాంతి కొరకు వెతుకులాట..అశాంతి పాల్జేయును కద..! అలుపుమిగులు పరుగులేల..శ్వాస ఇల్లు చాలునుగా..! చెలిమిమూట గాక గొప్ప నిధి ఉందా లోకంలో..!? ఏవేవో కోర్కెలేల..ఎదురు చూపు చాలునుగా..! కోపంతో సాధించే వస్తువెంత సుఖమిచ్చును..!? తపము లేక తాపమేల..ప్రేమధనము చాలునుగా..! కోటికోట్ల దైవాలే ఉండిరి కద ఎదలోనూ ఎట్టఎదుట..! చూడలేని గొడవలేల..సత్యమతము చాలునుగా..! ఈ మాధవ..వేదనలో దాగున్నది వేదవిద్య..! విమర్శించు తత్వమేల..మౌన వ్రతము చాలునుగా..!! Author: Madhav […]

Read More →