Loading...
You are here:  Home  >  'రూపమెలా ఉండునటా..!?'
Latest

రూపమెలా ఉండునటా..!?

By   /  July 7, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

వెంటాడే వేదనలకు రూపమెలా ఉండునటా..!? ప్రేమించే హృదయానికి అద్దమెలా ఉండునటా..!? బ్రహ్మకమల తీర్థంలో నాచు పట్ట చూస్తావా..! నిత్యహంస యానానికి సాక్ష్యమెలా ఉండునటా..!? కాంతిపూల వనములోన గరిక కొరకు వెదికేవా..! పసిడివెలుగు ద్వారానికి పరువమెలా ఉండునటా..!? చేతిగీత..నుదుటి రాత కలిసి నవ్వుకున్నాయిగ.. చూడ’లేని మరణానికి స్థానమెలా ఉండునటా..!? మధురమైన పండ్లబుట్ట..ముగ్గుబుట్ట అవుతున్నదె.. పంచబడే తత్వానికి దైన్యమెలా ఉండునటా..!? చెలిమిగాక మరి ఏమీ..తెలియదుగా మాధవునకు.. పరిమళించు మౌనానికి రాగమెలా ఉండునటా..!? Author: Madhav Rao Koruprolu

Read More →