By Deccan Abroad Reporter / July 14, 2016 / Featured News, Literature, Poetry, Telugu Literature, Telugu Poetry, Telugu Short Stories, పాటల పల్లకి - పలుకుల వల్లకి / No Comments
రచన: “పద్య కళాప్రవీణ” డా.ఆచార్య ఫణీంద్ర ———————————————————– మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు – కరాల బోలెడిన్ తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నే వేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులే పూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!