Loading...
You are here:  Home  >  'Madhav Rao Koruprolu'
Latest

Telugu Ghazal: ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..!

By   /  January 3, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

కోటి సూర్యుల కోవెలంటే..నుదుటి నేత్రమె తరచి చూస్తే..! మరణమన్నది ఎక్కడున్నది..కన్నులారా నిలచి చూస్తే..! ప్రమాదాలను సృష్టిజేసే..మనసు చిత్రము తెలియవేలా.. మంత్రతంత్రము లన్ని ముసుగులె..కాస్త శ్రద్దగ తలచి చూస్తే..! గుండెలయలను అనుసరించే..విద్య ఏదో పట్టవలెనిక.. శ్వాస వీణను మీటు వేళ్ళను..చెలిమిమీరగ వలచి చూస్తే..! మాయఖర్మము చుట్టుకున్నది..కర్మచక్రము లేదు విడిగా.. ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..! కలల పక్షుల విరహవేదన..తీర్చు హంసల గగనమదుగో.. నేను నాదను భావసంపద..మరచి హృదయము పరచి చూస్తే..! గజల్ మాధవ అక్షరాలకు..అద్దమంటే మౌనవనమే.. జపము స్మరణలు […]

Read More →
Latest

Telugu Ghazal: పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..!

By   /  January 3, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

అదేపనిగ చదువుకునే ప్రేమ లేఖనైతె చాలు..! పరిమళించు అందమైన తీపి ఊహనైతె చాలు..! నీ హృదయపు కోవెలలో వెలుగు దీపశిఖ ఏదో.. చూస్తు అలా తేలిపోవు..పక్షి పాటనైతె చాలు..! విరహమధువు గ్రోలుతున్న  తుమ్మెదలా ఎందుకిలా..?! నీ వెలుగున ఆడుకునే..మబ్బు తునకనైతె చాలు..! ఏ వాసన లేని పూలతీవలాగ బ్రతకటమా..!? పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..! మట్టిగుండె లయమాటున నిశ్చలమౌ ప్రాణసఖీ.. లాలనలకు అతీతమౌ..చెలిమి వీణనైతె చాలు..! ఈ మాధవ గజల్ సొగసు చూడాలిక అరకన్నుల.. చెప్ఫరాని భావాలకు..ప్రేమమాలనైతె […]

Read More →
Latest

Telugu Ghazal: సంబరాలు నింపినావు..జగమంతా గొడవైనది..!

By   /  December 25, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

వాలుజడను విసిరినావు..మనసంతా గొడవైంది..! వాలుచూపు రువ్వినావు..తనువంతా..గొడవైంది..! నెమలిఆట నిలచిపోయె..నీ సొగసులు చూడగానె.. ఎంతమాయ చేసినావు..వనమంతా..గొడవైంది..! కలహంసల జలకాలకు..నీ నవ్వే నదియైనది.. సరసమెంత కురిసినావు..సరసంతా గొడవైనది..! పగలురేయి తేడాలే లేకపోయె జగడాలకు.. పగడాలను విసిరినావు..వలపంతా గొడవైనది..! మైమరచిన వసంతాలు..తుళ్ళిపడక తప్పదుగా.. సంబరాలు నింపినావు..జగమంతా గొడవైనది..! మాధవు అద్దమంటి గజల్ నిధియె నీవు కదా.. మౌనాలను మీటినావు..ఇహమంతా గొడవైనది..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: నా దారిన ప్రతి అడుగుకు అరచేతిని నిలిపినావు..

By   /  October 15, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నీ నవ్వుల ముత్యాలను ఏరుకనే పనే చాలు..! నీ తలపుల వజ్రాలను దాచుకునే పనే చాలు..! నా దారిన ప్రతి అడుగుకు అరచేతిని నిలిపినావు.. నీ చూపుల కిరణాలను అల్లుకునే పనే చాలు..! జీవితాన్ని నాటకంగ గుర్తించుట నేర్పినావు.. నీ పదముల వేదాలను నేర్చుకునే పనే చాలు..! అద్దమంటి నా మనసును అందుకోర కానుకగా.. నీ వలపుల మౌనాలను చేరుకునే పనే చాలు..! స’రసవాణి వీణియపై సుస్వరాల ధారలేవొ.. నీ పెదవుల హాసాలను అందుకునే పనే చాలు..! […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 16.శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు..”

By   /  October 10, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, ఆణిముత్యాలు  /  No Comments

అంకితభావం,శ్రద్ధ,పట్టుదల,సహనం,కృషి అన్నీ అందరిలో ఉంటాయి.వాటిని ఎవరికి వారే గుర్తించి గ్రహించి తమను తాము ప్రోత్సహించుకున్నవారే ఆదర్శ వ్యక్తులుగా ఆణిముత్యాలుగా జాతి చరిత్రలో చిరస్థాయిగా మిగిలి ఉంటారు.అలా..     మన తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించిన.. శ్రీ ”సాలూరు రాజేశ్వరరావు గారు..అత్యద్భుతమైన వెండితెర వెలుగులకు అజరామరమైన సంగీతపుమధురిమలు అందించినవారిలో  శ్రీ రాజేశ్వరరావురు ప్రముఖులు తెలుగువారు గర్వించగ్గ సంగీతదర్శకులలో వీరికి ప్రత్యేకస్థానముంది. సాలూరు మండలములోని శివరామపురం  గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు […]

Read More →
Latest

Telugu Ghazal: కానలేని నీ సొగసుల తలపు ఎలా పండించను..?!

By   /  October 10, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

మాటాడని నీ పెదవుల నోము ఎలా పండించను..!? నీ తియ్యని ఎదలోతుల వలపు ఎలా పండించను..?! వికసించని సన్నజాజి మొగ్గలలో నీ భావన.. కానలేని నీ సొగసుల తలపు ఎలా పండించను..?! అక్షరాల మధుపాత్రగ మారినాను ఈ రేయిని.. ఎదురుచూచు సోయగాల సిగ్గు ఎలా పండించను..?! మౌనాలను చూపులలో బంధించుట కుదిరేనా.. గగనాలను అలరించే ముద్దు ఎలా పండించను..?! సెలయేటికి జోలపాడు ఆ రాగం పేరేమో.. తెలుపలేని విరహాలకు పద్దు ఎలా పండించను..?! చెలిమివనపు మాధవునకు గజలులాగ […]

Read More →
Latest

Telugu Ghazal: మౌనంలో మునగకుండ ముక్కు మూసుకోనేల ..

By   /  October 9, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

ఆకాశం మధురమైన కథలెన్నో  పంచుతుంది..! ప్రతి కిరణం అందమైన సుధలెన్నో పంచుతుంది..! పండుగంటె అంతరంగ ప్రశాంతత ఉన్న రోజు.. చిరునవ్వే దివ్యమైన నిధులెన్నో పంచుతుంది..! రాయికున్న మనసైనా లేని మనిషి దేనికటా.. తీపి వలపె సత్యమైన మరులెన్నో పంచుతుంది..! చినుకు మనసు తెలియలేని చెలిమికర్థ మేమున్నది.. చూపేగా నిత్యమైన కలలెన్నో పంచుతుంది..! మౌనంలో మునగకుండ ముక్కు మూసుకోనేల .. మెఱుపేగా ధర్మమైన నగలెన్నో ..పంచుతుంది.. ! ఈ మాధవ గజల్ గుండె..సవ్వడెంత అద్భుతమో.. అనుక్షణం లలలితమైన సెగలెన్నో […]

Read More →
Latest

Telugu Ghaal: తగవులన్నీ మెల్లమెల్లగ మౌననిధికే దారి చూపును..

By   /  October 9, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

ఇల్లు కన్నా అసలు స్వర్గం ఎక్కడున్నది.. ఎవరికైనా..! మనసు కన్నా నిలుపు దీపం ఎక్కడున్నది..ఎవరికైనా..! తగవులన్నీ మెల్లమెల్లగ మౌననిధికే దారి చూపును.. తలపు కన్నా నడుపు మార్గం ఎక్కడున్నది..ఎవరికైనా..! వెతుకులాడే పనే దండగ..ఎరుక దండిగ పెంచుకోవలె.. వలపు కన్నా  గెలుపుగుర్రం ఎక్కడున్నది..ఎవరికైనా..! ఆశ పడుటే  ఆశయాలకు ముప్పు తెచ్చును తరచి చూస్తే.. భయము కన్నా చంపు మరణం ఎక్కడున్నది..ఎవరికైనా..! బండరాయికి పూజ చేస్తూ కసాయిలాగ మారనేలా.. తనువు కన్నా వెలుగు ద్వారం ఎక్కడున్నది..ఎవరికైనా..! గజల్ మాధవ భావగగనం […]

Read More →
Latest

Lal Bahadur Shastri: “మన ఆణిముత్యాలు – 14..శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి”

By   /  October 3, 2016  /  Community News, Deccan Abroad, Editorial, Featured News, Telugu Community News, ఆణిముత్యాలు  /  No Comments

మన ఆణిముత్యాల కోవలో అత్యద్భుతమైన ఆదర్శ వ్యక్తిత్వం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారిది.స్పూర్తిదాయకమైన వారి గురించి మన పిల్లలకు ముఖ్యంగా యువతరానికి బాగా నూరిపోయవలసిన తరుణమిదే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. అతి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత […]

Read More →
Latest

Father of the Nation: “మన ఆణిముత్యాలు – 13.మ హాత్మా గాంధీజీ..!”

By   /  October 2, 2016  /  Asia News, Deccan Abroad, Editorial, Featured News, Literature, World News, ఆణిముత్యాలు  /  No Comments

మన భారతదేశ చరిత్రకే మణిమకుటం మహాత్మాగాంధీ.అతనే “మోహన్ దాస్ కరంచంద్ గాంధీ” అక్టోబర్ 2 1869 ,గుజరాత్  లోని పోర్ బందర్  లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుత్లీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరీబాయితో […]

Read More →