” రోజీ – రాజీ..!” అది వాళ్ళ పెళ్లిరోజు పండుగ సిల్వర్ జూబ్లీ డే..! నిద్ర లేస్తూనే.. ” సారీ రా..రోజీ..వెరీ సారీ..! ” చెప్పాడు ఆమె భర్త ‘రాజీ’..! ఆమెకు షాక్..ఆశ్చర్యంగా చూస్తూ.. ” అదేంటండీ..ఇప్పుడేమైందనీ..కనీసం నిద్రకళ్ళు కూడా తెరవకుండానే ఈ సారీలేంటీ..?! “ అయోమయంగా చూస్తూ అడిగింది..కాఫీ కప్పుతో అతడిని నిద్రలేపిన ‘రోజీ’..! ” పెళ్ళైన మర్నాటి నుండి ఈ మాట చెప్పాలనుకుని పాతికేళ్ళయిపోయిందోయ్..! ” కాస్త విచారంగా అంటుంటే..ఆమె గలగలా నవ్వేసి.. ” […]