Loading...
You are here:  Home  >  'Telugu Ghazal'
Latest

Telugu Ghazal: ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు..

By   /  February 4, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నచ్చిన సంగతి..తోచును తియ్యగ..! నచ్చని ముచ్చట..గుచ్చును తియ్యగ..! ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు.. విమర్శ నిప్పై..కాల్చును తియ్యగ..! మంచిని చెడుగా..తలచుట జరుగును.. అనుభవజ్ఞానం..మార్చును తియ్యగ..! కత్తుల నగరిలొ..బాంబుల యుద్ధం.. వీడని..ముంచును తియ్యగ..! మాటలు చూపులు..శాంతించేనా.. తలపులు నిలచిన..తెలియును తియ్యగ..! తీపికి చేదుకు..తేడా..లేదుర.. మాధవ గజలున..మ్రోగును తియ్యగ..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: జరుగు యుద్ధకాండలన్ని నిలుప ఎవరి తరమౌను..

By   /  November 4, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

సానుభూతి బ్రెడ్డుముక్క పెట్టబోకు ఏవేళా..! సాయమవగ వెనుకముందు ఆడబోకు ఏవేళా..i స్నేహానికి నిర్వచనం గుండె సడే చెప్పగలదు.. గతంలోని చేదేదీ చేదబోకు ఏవేళా..! జరుగు యుద్ధకాండలన్ని నిలుప ఎవరి తరమౌను.. రాయబార మేదైనా నెఱపబోకు ఏ వేళా..! కలతనిదుర మునిగె మనసు వరమేదో అందకనే.. మనసుపడే ముచ్చటేదొ ఆపబోకు ఏవేళా..! దారిలోని ప్రతి మలుపొక కావ్యగంగ పుట్టిల్లే.. ప్రవహించే నదిపాటను దాచబోకు ఏవేళా..! అంతరంగ జగతిలోకి వెళ్ళి చూడు మాధవుడా..! ప్రసాదమౌ మౌనాలను మరువబోకు ఏవేళా..! Author: […]

Read More →
Latest

Telugu Ghazal: యంత్రంలా పనిచేస్తే సుఖశాంతులు దక్కేనా..

By   /  November 4, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

ఆమనితో వాదులాట జరుపుతున్న వారెవ్వరు..! మరణమంటె భయం లేక బ్రతుకుతున్న వారెవ్వరు..!   నీ చూపుల వాగులోన స్నానమాడ మనసైనది.. చూప’లేని విరహాగ్నిని పెంచుతున్నవారెవ్వరు..! అటు యుద్ధం..ఇటు అలజడి..ఎందుకిలా కలహాలో.. మత చిచ్చును ఆయుధంగ వాడుతున్నవారెవ్వరు..! ప్రాణాలను ఉగ్గబట్టు ఉద్యోగం సైనికులది.. ప్రపంచాన్ని శాంతిదిశగ నడుపుతున్న వారెవ్వరు..! ప్రశ్నించే మనసెప్పుడు నెమ్మదించు ఎవరికైన.. అరకన్నుల చూపు కాస్త నిలుపుతున్న వారెవ్వరు..! యంత్రంలా పనిచేస్తే సుఖశాంతులు దక్కేనా.. తనను తాను గమనిస్తూ ఆగుతున్న వారెవ్వరు..! స్వప్నాలకు రెక్కలొచ్చి గగనాలను దాటాలోయ్.. అందమైన లోకాలను […]

Read More →
Latest

Telugu Ghazal: సరిగమలకు స’రసాలను నింపు హంస కలలెన్నో..!

By   /  October 28, 2016  /  Featured News, Literature, Telugu Literature  /  No Comments

ముత్యమంటి చినుకువీణ ఆలాపన ప్రేమ కదా..! చిన్ని గింజ గుండెదివ్వె ఆరాధన ప్రేమ కదా..! పండ్లిచ్చే చెట్టు నీడ ఎంత హాయిగుంటుందో..! చెప్పలేని తేనెలింటి ఆ భావన ప్రేమ కదా..! ఆనందపు పరిమళాలు పంచుతున్న మనసెక్కడ..?! కానరాని మౌనవేణు పరిలాలన ప్రేమ కదా..! సరిగమలకు స’రసాలను నింపు హంస కలలెన్నో..! అంతరంగ సురసీమన మది సాధన ప్రేమ కదా..! కనుల దూకు చినుకులెల్ల మిల కట్టు పని ఏమిటొ..?! మాయమయే మంచుపూల పరిశోధన ప్రేమ కదా..! మాధవునకు […]

Read More →
Latest

Telugu Ghazal: గంధాలను గగనాలకు తరలించే మాధవుడా..!

By   /  October 27, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

మనసులోన గీసుకున్న చిత్రమేదొ ఎదురయ్యెను..! ఎదలోతున దాచుకున్న శిల్పమేదొ ఎదురయ్యెను..! మెఱుపు పూలవనములోని కోకిలెవరొ చెప్పాలా.. ప్రణయసుధలు నింపుకున్న కల్పమేదొ ఎదురయ్యెను..! వెక్కిరించు విరహాలను మాయమెలా చేసిందో.. పసిడివెలుగు నిలుపుకున్న రాజ్యమేదొ ఎదురయ్యెను..! పున్నమిలో పరిమళించు మౌనవీణ తాను కదా.. సిగ్గులెన్నొ పొదువుకున్న స్వర్గమేదొ ఎదురయ్యెను..! కాటుకింటి పరువాలకు ఎన్ని కళలొ ఎవరికెరుక.. కథలెన్నో ముసురుకున్న కావ్యమేదొ ఎదురయ్యెను..! గంధాలను గగనాలకు తరలించే మాధవుడా..! చెలిమిపంట నోచుకున్న గీతమేదొ ఎదురయ్యెను..! Author: MadhavRao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: అగ్గిపూల వాన పానుపైన వేళలలో..

By   /  October 25, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

పున్నమిలా రారమ్మని చెప్పాలని ఉంది..! సిగ్గుపూల ఆ వెన్నెల పట్టాలని ఉంది..! నువు చూడని ఈ క్షణాల సవ్వడేల విందు..?! నీతోనే జగాలన్ని చుట్టాలని ఉంది..! మదిని ఎలా దూదిపింజ లాగ మలచినావు.. నీ తలపుల తలగడలా నవ్వాలని ఉంది..! విరహమధువు ఒలుకుతున్న కోకిలమా.. గుండెలయల తంత్రులలో వెలగాలని ఉంది..! అగ్గిపూల వాన పానుపైన వేళలలో.. సిరిమల్లెల పరిమళమై ముసరాలని ఉంది..! మాధవునకు ఒక గజలై  పరవశించు జాణ..  నీ అందెల రవళులలో దాగాలని ఉంది..! Author: MadhavRao […]

Read More →
Latest

Telugu Ghazals: బాధపెట్టు బాధుండదు నీవు కోరి పడకుండా..

By   /  October 25, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

మరణమంటె ఏమున్నది తోటగేటు మూసినట్లు..! పుట్టుకంటె బ్రతుకువిలువ తెలియ మరలినట్లు..! బాధపెట్టు బాధుండదు నీవు కోరి పడకుండా.. మనిషంటే చిరునవ్వుల చెట్టు మొగ్గ తొడిగినట్లు..! ప్రాణమెంత తియ్యనిదో పోతుంటే తెలుస్తుంది.. పూవు త్రెంచ  కన్నబిడ్డ గొంతు పట్టి నరికినట్లు..! యుద్ధనీతి కోవిదులకు వేదాంతం చెప్పడమా..?! భయపడితే నీకు నీవు మంటలలో దూకినట్లు..! మిసైలేమి చేయగలదు మౌనం విస్పోటిస్తే.. సరిహద్దుల నాటకాల వేదికలను పేల్చినట్లు..! మాధవుడా..సాక్షిలాగ నిలచు విద్య నేర్వవేమి..!? చెలిమిగుట్టు పట్టకుంటె నీడలతో పోరినట్లు..! Author: Madhavrao […]

Read More →
Latest

Telugu Ghazal: కలలవీణ రాగాలను నిలిపినాను చూడవేమి..!?

By   /  October 4, 2016  /  Community News, Featured News, Literature, Telugu Community News, Telugu Ghazals  /  No Comments

నిదురరాని రేయిలాగ మిగిలినాను చూడవేమి..!? నీ నీడకు నేస్తంలా మారినాను చూడవేమి..!? చీకటెంత తియ్యనిదో మధువుకెలా తెలుస్తుంది.. నీ ఎదుటే చిత్రంగా నిలచినాను చూడవేమి..!? కాటేసే కాలమేది లేదన్నది నీ మౌనం.. అందాలను అక్షరాల కురిసినాను చూడవేమి..!? ఈ రెప్పల మువ్వలెంత అల్లరివో అయ్యారే.. కలలవీణ రాగాలను నిలిపినాను చూడవేమి..!? యుగాలుగా అద్దంతో చెప్పలేని యుద్ధాలే.. చిత్తశాంతి మంత్రంలా అందినాను చూడవేమి..!? గజల్ గుండె గొంతులోని మార్దవమా మాధవుడా.. సుస్వరాల కోవెలలో నింపినాను చూడవేమి..!? Author: Madhav […]

Read More →
Latest

Telugu Ghazal: భజంత్రీలు వినిపించగ ఓప’లేని ఆరాటం..!

By   /  September 24, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నీ సన్నిధి తరియించగ చెప్ప’లేని ఆరాటం..! నీతో నే జీవించగ మరువ’లేని ఆరాటం..! జన్మలెన్ని ఎత్తానో నీ చెలిమిని పొందేందుకు.. విరహసీమ కలహించగ విడువ’లేని ఆరాటం..! మూడుముళ్లు..బాషికాలు..ముచ్చటగా ఏడడుగులు.. సంస్కృతియై నడిపించగ మచ్చ’లేని ఆరాటం..! చింతలన్ని తొలగించే సంప్రదాయ తెరసెల్లా.. ప్రేమవనం పండించగ నిలుప’లేని ఆరాటం..! అందమైన అనుబంధపు వెన్నెలయే అనుక్షణం.. మధురోహలు వెలిగించగ చూప’లేని ఆరాటం..! ఈ మాధవ గజలేమో మౌనాలను మీటుతొంది.. భజంత్రీలు వినిపించగ ఓప’లేని ఆరాటం..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: అక్షరాల తీర్థంలా అందుతోంది నీ పేరే..!

By   /  September 23, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

గుండెకడలి అలఅలలో మ్రోగుతోంది నీ పేరే..! విసుగెఱుఁగని ఇసుకలలో నవ్వుతోంది నీ పేరే..! వేనవేల వసంతాల సందడింటి పరిమళమా.. నా తనువున అణువణువున వెలుగుతోంది నీ పేరే..! నీ చూపుల గారడితో ఏమి మాయ చేస్తావో.. మాయామవని మనసేమో పలుకుతోంది నీ పేరే..! నీ చెలిమిని తూచేందుకు ఏ దళములు సరిపడునో.. ప్రేమమత్తు మధువేదో చిమ్ముతోంది నీ పేరే..! ఏ జాబిలికేమెరుక నీ సొగసు రుచి ఎంతో.. మౌనానికి మంత్రశక్తి నింపుతోంది నీ పేరే..! మాధవునకు గజలౌతూ […]

Read More →