Loading...
You are here:  Home  >  'TeluguGhazal'
Latest

Telugu Ghazal: నీ తియ్యని లోకంలో..నను మాయం చేస్తావుగ..!

By   /  January 18, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

పరిమళించ లేకున్నా..ఆనందం ఇస్తావుగ..! ముళ్ళమధ్య నీవున్నా..అను’రాగం పూస్తావుగ..! అమ్మలాగ నీడనిచ్చు..నీ తత్వం అమోఘం.. మౌనంగా నీ స్నేహం..అను’బంధం వేస్తావుగ..! నా తోటకు కంచెలాగ..ఉంటావే శాశ్వతంగ.. నా శ్వాసల కాన్వాసున..ఓ చిత్రం గీస్తావుగ..! గరికనైన గులాబినైన ఒకేలా చూడగలవు.. నాది కాని నా ప్రతిభతొ..ఓ కావ్యం వ్రాస్తావుగ..! ఈ అక్షర యజ్ఞంలో..ప్రతిమాటా మంత్రమేగ.. నీ తియ్యని లోకంలో..నను మాయం చేస్తావుగ..! మాధవుడా..ఏమిటసలు..నీ గానం సౌందర్యం.. నిద్దురలో మెలకువలో..నా హృదయం..కోస్తావుగ..! Author” Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను..

By   /  January 13, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

గజల్ 1326. నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది..! నీ కన్నుల తడిచాటున ఒదగాలని ఉంది..! అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను.. నీ పెదవుల మెఱుపుతీవ కావాలని ఉంది..! ఆశకేమి తెలియదులే నా ప్రేమ అర్థం.. నీ కలలకు పానుపుగా మారాలని ఉంది..! ఏ పూవులు బాణాలుగ వేయలేను చూడు.. నీ మౌనపు వెన్నెలలో ఆడాలని ఉంది..! రాలుతున్న చెమటచుక్క గాలికలుసు కాదు.. పవిత్రతకు క్రొత్తర్థం చెప్పాలని ఉంది..! ఈ చెలిమిని ఓ కలిమిగ నిలుపుతున్న […]

Read More →
Latest

Telugu Ghazal: గజల్ రాణి పాదాలకు పారాణిగ మారేనే..

By   /  November 20, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

సిగ్గుపూల తరువింటికి మనసు వ్రాసి ఇచ్చానే..! కనులెత్తని కలువచెలికి కలలు వ్రాసి ఇచ్చానే..! విరహాలను తరిమేసే పసిడిరాశి తానేగా.. ముద్దొచ్చే చినుకింటికి మరులు వ్రాసి ఇచ్చానే..! గజల్ రాణి పాదాలకు పారాణిగ మారేనే.. తన అందెల మౌనాలకు ధ్వనులు వ్రాసి ఇచ్చానే..! అనుక్షణం వర్ణమయం చేస్తున్నది భువనాలను.. తన పాటకు సుస్వరాల లయలు వ్రాసి ఇచ్చానే..! నేను,నాది విసిరేయగ సాయమైన గగనమామె.. మరపువీణ రాగసుధల సరులు వ్రాసి ఇచ్చానే..! మాధవుడా..మాటలతో కలవరమే మిగిలేనట.. అనుభూతుల పరంపరల తనువు […]

Read More →
Latest

Telugu Ghazal: ఒక్క కబురు చాలు కదా..నే వాగై పొంగేందుకు..!

By   /  November 5, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

ఒక్క చూపు చాలు కదా నే పాటై కురిసేందుకు..! ఒక్క నవ్వు చాలు కదా..నే పువ్వై పూసేందుకు..! చెప్పలేని వేదనలను రూపుమాపు మందేదో.. ఒక్క కబురు చాలు కదా..నే వాగై పొంగేందుకు..! నీ తలపుల పరమాన్నం రుచి తెలిపే మాటలేవి..!? ఒక్క అడుగు చాలు కదా.. నే చరితై మిగిలేందుకు..! గాలికెంత దిగులో మరి నీ పేరే పలకాలని.. ఒక్క పిలుపు చాలు కదా..నే మెఱుపై విరిసేందుకు..! చిత్రమైన అనుభవాల ఊసులన్ని మధురములే.. ఒక్క ముద్దు చాలు […]

Read More →
Latest

Telugu Ghazal హంసచెలీ..!

By   /  August 1, 2016  /  Deccan Abroad, Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నా బంగరు కలల జగతి పండించే హంసచెలీ..! సఖుని జాడ ప్రియమారగ పట్టిచ్చే హంసచెలీ..! ఊహమాటు పెన్నిధినే పెనిమిటిగా తెస్తావుగ.. మేఘాలను వీణలుగా పలికించే హంసచెలీ..! రగులుతున్న విరహాలను చల్లార్చే పని నీదే.. పసిడిమల్లె పరిమళాలు చిందించే హంసచెలీ..! నిదురకన్నె ఎదలోయల ఎంత గుబులు రేగిందో.. ఎదురుచూపు మధురిమలను ఒలికించే హంసచెలీ..! వయారాల కేమున్నది..వరాలనే కోరునుగా.. నవవసంత వింజామర అందించే హంసచెలీ..! ఈ మాధవ అక్షరాలు తుమ్మెదలై వెన్నంటెను.. కణకణమున గజల్ మధువు గుప్పించే హంసచెలీ..! Author: […]

Read More →
Latest

Telugu Ghazal

By   /  July 23, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Literature, Telugu Poetry, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

నీ నవ్వుల పూలదారి నడిపించే కలలు వద్దు..! వాస్తవాన్ని అందించక కవ్వించే కలలు వద్దు..! కోరికలకు గూడు కట్టి పెంచలేను ఏమాత్రం..! నన్ను నాకు కాకుండా బంధించే కలలు వద్దు..! ఆపదలో ఆదుకునే చెలిమికన్న కోరనేమి..! మెలకువనే దోచుకొనగ కలహించే కలలు వద్దు..! ఏ సంపద ఎంతున్నా నీ తోడే పెన్నిధి కద..! అహంకార కిరీటాన్ని రక్షించే కలలు వద్దు..! పరితపించు వేళలింక తాళలేను ఘడియైనా..! అడుగడుగును గుచ్చిగుచ్చి వేదించే కలలు వద్దు..! గజలు సొగసు వర్షించే […]

Read More →