
చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC) 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరిపింది. స్థానిక అర్లింగ్టన్ హైట్స్ లోని అట్లాంటిస్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మహిళలకు పైగా హాజరు అయ్యారు. శ్రీమతి క్రాంతి కాజా, శ్రీమతి ఉమా అవదూత, శ్రీమతి నీలిమ చేకిచర్ల, శ్రీమతి వినీత పొద్దుటూరి, శ్రీమతి అర్చన పొద్దుటూరి మరియు శ్రీమతి ప్రసన్న కందుకూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను TAGC బోర్డు మెంబెర్స్ సాదరంగా బహుమతులతో ఆహ్వానించారు. వేదికను చాలా చక్కగా అలంకరించారు, హాల్ లో వినూత్నంగా ఏర్పాటు చేసిన బైక్ అతిధులను ఆకట్టుకుంది. వివిధ వినోద కార్యక్రమాలతో, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. టిక్ టాక్ కాంటెస్ట్ ను చాలా మందిని ఆకట్టుకుంది. విజేతలుగా గెలుపొందిన వారిని సిటీఎయిర్ వారు బహుమతులు మరియు ట్రావెల్ వౌచెర్స్ ను ప్రధానం చేసారు.
టిఏజిసి మహిళా ఫోరమ్ రికార్డు స్థాయిలో విరాళాలను సేకరించి బై ది హ్యాండ్ కిడ్స్ క్లబ్ వారికి అందించారు.

కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు బావార్చి, షాంబర్గ్ వారు రుచికరమైన ఆహారాలను వడ్డించారు.
టిఏజిసి అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి ఈ కార్యక్రమ దాతలు సిటీ ఎయిర్ ట్రావెల్స్, రాఫల్ బహుమతుల దాతలు రీగల్ జ్యూవెల్లెర్స్, పిక్సెల్ బ్లింక్స్ ఫోటోగ్రఫీ సందీప్ గారికి, హాల్ ను అలంకరణ చేసిన ఖాస్ డెకార్స్, డిన్నర్ ప్రదాతలు బావార్చి బిరియానిస్ షాంబర్గ్ వారికి, హాజరైన అతిధులకు, నిర్వాహుకులకు, వాలంటీర్లకు మరియు బోర్డు ప్రతినిధులకు తన కృతజ్ఞతలు తెలియయజేసారు. టిఏజిసి మహిళా ఫోరమ్ చైర్ శ్రీమతి ఉమా అవదూత మరియు ఇతర మహిళా డైరెక్టర్లు, వాలంటీర్లు గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి శ్రమించారని తెలిపారు.

వేదిక అలంకరణ చేసిన శ్రీమతి నీలిమ చేకిచర్ల మరియు ఇతర వాలంటీర్లకు; అతిధుల ఆహ్వాన మరియు రిజిస్ట్రేషన్ కు సహాయాన్ని అందించిన బోర్డు మెంబర్లు శ్రీ వెంకట్ గునుగంటి, శ్రీ అంజిరెడ్డి కందిమళ్ల, శ్రీ రమణ కాల్వ లకు; ఆహార ఏర్పాట్లను పర్యవేక్షించిన శ్రీ సంతోష్ కొండూరి, శ్రీ నవీన్ ఎడుమ, శ్రీ శశి చావా కు శ్రీమతి ఉమా తమ కృతఙ్ఞతలు తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.