Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

TAGC Annual Summer Picnic” event on June 4th 2017 (at Chicago, USA)

By   /  June 6, 2017  /  No Comments

    Print       Email
చికాగో, జూన్ 4 ,2017 :  చికాగో మహా నగర తెలుగు సంస్థ , టిఏజిసి (TAGC) వేసవి కాలాన్ని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికీ వనభోజనాలు ఏర్పాటు చేసింది.
ఈ సంబరాలు చికాగో శివార్లలోని ELKGROVE VILLAGE లోని BUSSEWOODS FOREST PRESERVE లో జరిగాయి. ప్రతి ఏటా జరిగే ఈ వన భోజనాలకు ఈ సంవత్సరం 950 కి పైగా సభ్యులు మరియు ఇతర అతిధులు హాజరయ్యారు. పెద్ద చిన్న బేధం లేకుండా అంతా వన భోజనాల్లో ఎంతో ఆనందోత్సాహాలతో పాలు పంచుకున్నారు. ఈ సారి టిఏజిసి (TAGC) కార్య వర్గ సభ్యులు స్వహస్తాలతో భోజనం బంగార అన్నం, కోడి కూర, ఆలుగడ్డ టమాటో కూర  వండి వడ్డించారు. పార్క్ లోనే వచ్చిన వారికీ గ్రిల్ల్డ్ చికెన్, వేడి వేడి దోసెలు, బజ్జిలు వేసి వడ్డించారు. ఇది వన భోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యాన్నం భోజనం తరవాత పుచ్చకాయ, చల్ల (మజ్జిగ)  అందించారు.
టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి  ఏడే వన భోజనాలు అద్భుతంగా నిర్వహించినందుకు పిక్నిక్ కోర్ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్బంగా రాము బిల్లకంటి, రంగ రెడ్డి లంకల, ఉమా అవధూత, విజయ్ బీరం, వాణి ఏట్రింతల, సంపత్ సంగేమ్, సాయి గొంగాటీ మరియు వాలంటీర్స్ ను అభినందించారు.
వచ్చినవారిని అలరించేందుకు టిఏజిసి (TAGC) ఎన్నో అట విడుపు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. మేన్స్ ఉమెన్స్ మరియు కిడ్స్ విభాగాలుగా ఎన్నో ఆటలా పోటీలను నిర్వహించింది.  మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, టగ్ అఫ్ వార్ ఆటల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలలో గెలిచిన వారికీ బహుమతులు అందజేసింది.
టిఏజిసి (TAGC) నిర్వహించే స్వచ్చంద సేవ కార్యక్రమాలకు ఫండ్ రైసింగ్ కు గాను రెండు మైళ్ళ నడక (Walkathon ) పోటీని  నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులని  ను అక్షయ విద్య ఫౌండేషన్ కు అందజేసింది.  పోటీలలో గెలిచిన వారికీ బహుమతులు అందజేసింది.
ఈ వన భోజనాల్లో భాగంగా వంటల పోటీలను నిర్వహించింది టిఏజిసి (TAGC). నోరూరించే వంటలతో పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులు అందజేసింది. తెలంగాణ సకినాలకు మొదటి బహుమతి, రవ్వ లడ్డులకు రెండవ బహుమతులను అందచేశారు.
టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి  ఏడే  కార్యక్రమాన్ని ముగిస్తూ, కార్యక్రమం విజయవంతం చేసినందుకు కార్యవర్గ సబ్యులకు, స్పాన్సర్స్, వాలంటీర్లు మరియు వచ్చిన అతిధులకు ధన్యవాదాలు తెలియజేసారు.
మీ
రామచంద్రా రెడ్డి ఏడే
TAGC అధ్యక్షులు
Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Appeal from Sankara Nethralaya OM Trust, Inc

Read More →