Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

TAGC Volleyball & Throw ball tournament

By   /  October 11, 2017  /  No Comments

    Print       Email
చికాగో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC – మొదటి తెలుగు సంస్థ) వాలీబాల్ మరియు త్రో బాల్ పోటీలను అక్టోబర్ 8 , 2017 న  స్థానిక బౌలింగ్ బ్రూక్ లోని  పెలికాన్ హార్బర్ ఇండోర్ ఆక్వాటిక్ పార్కు, IL 60440 లో Indsoft Inc & హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సహకారాలతో చాలా ఘనముగా నిర్వహించింది.
TAGC అధ్యక్షులు రామచంద్ర ప్రతిపాదించిన బొబ్బిలి మాధవరెడ్డి గ్యాపక వాలీబాల్ మరియు త్రో బాల్    పిలవబడాలని ప్రతిపాదనను TAGC కార్యవర్గము ఏకగ్రీవంగా ఆమోదించింది. స్వర్గీయ  శ్రీ మాధవ రెడ్డి గారు అధ్యక్షుడిగా మరియు TAGC యొక్క స్థాపక సభ్యుడిగా ఉన్నారు. TAGC సభ్యులను మరియు తెలుగు వారందరిని సరదాగా ఉండటానికి మరియు సాధారణ జీవితాల నుండి ఉపశమనములా, అలాగే కొత్త స్నేహితులను సంపాదించడానికి ప్రోత్సహించడం ఈ పోటీల యొక్క ప్రధాన లక్ష్యం.
TAGC కార్యవర్గం మరియు క్రీడావిభాగము యొక్క అంకితభావ కృషితో   ఈ సంవత్సరము  నమోదు చేసిన జట్ల  సంఖ్య TAGC చరిత్రలో మొదటి స్థానము . సోషల్ మీడియా మరియు సాంఘిక మాద్యముల క్క అన్ని మార్గాలను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేయబడింది. TAGC పురుషుల కోసం వాలీబాల్ టోర్నమెంట్ను 3 విభాగాలలో నిర్వహించింది మరియు మహిళలకు త్రో బాల్  నిర్వహించింది. వాలీబాల్ విభాగములో బిగినర్స్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. మొత్తం ౩౦ వాలీబాల్ జట్లు, 4 గ్రూపులు, 4 కోర్టులు, 9 గంటల, 90 పైగా మ్యాచ్ లు    280 మంది పైగా క్రీడాకారులు మరియు 200 మంది అతిథులతో చాలా ఘనముగా నిర్వహించింది .ప్రతి జట్టు  గ్రూప్ స్థాయిలో కనీస 3 ఆటలు ఆడింది తరువాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ . మొత్తం వాలీబాల్ యొక్క పండుగ లాగా మారిపోయింది . క్వార్టర్ ఫైనల్స్ నుండి ప్రతి  పోటీలు చాలా ఉత్కంఠ భరితముగా నువ్వా నేనా అన్నట్టు సాగాయి.
TAGC సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, ఆటల పర్యవేక్షణ, విజయాలు మరియు నష్టాలను నమోదు చేయడం,  స్కోర్లను నవీకరించడం, తదుపరి మ్యాచ్లకు ఖచ్చితంగా జట్లు మరియు రిఫరీలు సమకూర్చడము చేయడం వంటివి సమయానుసారంగా అందుబాటులో ఉన్నవాలంటీర్స్ & మా BOD ప్రవీణ్ వేమలపల్లి, అవినాష్ లట్టుపల్లి, విజయ్ భీరమ్, అంజి కందిమళ్ల, రాము బిల్లకంటి , మమతా లంకల ,  ప్రదీప్ కందిమళ్ల , జ్యోతి చినాతలాపని మరియు వాలంటీర్స్ శశి, రమణ కాల్వ , రోహిత్ అకులా, సంతోష్ కొండూరి మరియు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు
TAGC సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే , ఇంద్స్పాప్ట్ & హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సంస్థల యజమాని వినోజ్ చనుమోలు, TAGC కార్యవర్గ సభ్యులు  మరియు  క్రీడావిభాగా సభ్యులతో కలిసి పోటీలలో గెలిచినా విజేతలకు బహుమతులను ప్రధానించారు
త్రో బాల్ :
విజేత: వెస్ట్ మాంట్  ఫ్యూరియస్ ఆరు
రన్నర్: రుద్ర జట్టు
వాలీబాల్ (అడ్వాన్స్డ్):
విజేత: వాలీబాల్ ఆడిక్ట్స్
రన్నర్: స్పార్టాన్స్
ఇంటర్మీడియట్ వాలీబాల్:
విజేతలు: దేశీ బాయ్స్ -1
రన్నర్: చికాగో బుల్స్
పురుషులకు వాలీ బాల్:
విజేతలు:స్మ్న్-1
రన్నర్: దేశీ బాయ్స్ -2
TAGC అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి , ఏడే , ఇండోర్ త్రో బాల్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయసహకారాలు చేసిన   INDSOFT INC CEO వినోజ్ చనుమోలు & హైదరాబాద్ హౌస్ శంబుర్గ్  వాసు వల్లభనేని మరియు ఆటస్థలం నిర్వహణ యాజమాన్యానికి  మరియు వాలంటీర్లు, రిఫరీలు, లైన్ పురుషులు, TAGC కార్యవర్గ సభ్యులు , క్రీడా కమిటీ & జట్టు కెప్టెన్లు అలాగే అన్ని జట్టు సభ్యులు, మీడియా  మిత్రులకు హృదయ ధన్యవాదాలు తెలిపారు
For photos please click on the below link:
చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC )
సప్తగిరి సంగెమ్
క్రీడల కమిటీ చైర్ (2017)
రంగారెడ్డి లెంకల
PR (2017)

WWW.TAGC.ORG

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

In RK Nagar support increases for DMK – former minister KN Nehru

Read More →