మాగ్నమ్ ఓపస్ ఐటి మరియు జీవీఆర్ రియాల్టీ తామా శ్రీ హేవిళంబి నామ సంవత్సరం ఆత్మీయ ఉగాది ఉత్సవాలు
ఏప్రిల్ 15,2017 అట్లాంటా నగరంలోని లాంబెర్ట్ స్కూల్లో “తామా” ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అట్లాంటా తెలుగు సంఘం “తామా” వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకు నగరంలోని జన సందోహం పదిహేను వందలకు పైగా కదలి వచ్చారు. మాగ్నమ్ ఓపస్ ఐటి మరియు జీవీఆర్ రియాల్టీ వారు సమర్పకులుగా తోడ్పడి ఆత్మీయ ఉగాది సంబరాన్ని అందించారు.
మొదటగా “తామా” మరియు “అమృతవర్షిణి” ఆధ్వర్యంలో జరిగిన సాహితి సదస్సు కార్యక్రమంలో పలువురు పిల్లలు మరియు పెద్దలు పాల్గొని కథలు మరియు స్వీయ రచనలు ప్రదర్శించారు. కిరణ్ మంచికంటి ,వెంకట్ చెన్నుబొట్ల,సుబ్బు భాగవతి, ,”తామా” సాహితి కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స , “తామా” ప్రెసిడెంట్ హర్ష యెర్నేని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ గాలి గుణశేఖర్ మరియు స్వామియాజులు గారిని అమృతవర్షిణి మరియు “తామా” సభ్యులు శాలువాతో పుష్పగుత్యాలతో సత్కరించారు.
తామా సాంస్కృతిక కార్యదర్శి ప్రియా బలుసు స్వాగతోపన్యాసం చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సభను ప్రారంభించారు. తదనంతరం యాంకర్ మధు “తామా” కార్యవర్గ సభ్యులని, బోర్డు సభ్యులని వేదిక మీదకు ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేయమని కోరారు. తర్వాత మధు, గాయని సుమంగళి , గాయకుడు ధనంజయ్ ని ఆహ్వానించి సభకి పరిచయం చేసి సాంస్కృతిక కార్యక్రమాలని ఘనంగా ప్రారంభించారు.
నగరములో ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు,నాటకాలు,పాటలు, ఆలపించిన శ్లోకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి శ్రీధర్ దర్శకత్వం వహించిన “తామా” వారి పెళ్లి సందడి నాటకం అతిథులని ఆనంద పరవశంలో ముంచాయి. దాదాపు మూడు వందల కళాకారులు పాల్గొన్న ఈ సాంస్కృతిక కార్యక్రమం వచ్చిన అతిథుల్ని అందరిని మంత్రముగ్థులని చేసినాయి.సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
విజ్జు చిలువేరు గారి ఆధ్వర్యంలో డాక్టర్ పి వేణు గోపాలరావు జ్ఞాపకార్థం మైత్రి జ్ఞాపికలను “తామా” బోర్డు సభ్యులు నగేష్ దొడ్డాక డాక్టర్ శేషు శర్మగారికి , “తామా” ప్రెసిడెంట్ హర్ష యెర్నేని డాక్టర్ శ్యాం సుందర్ ఎల్లంరాజు గారికి బహుకరించారు.
తామా కార్యవర్గ సభ్యులు మరియు బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో “తామా” అధ్యక్షుడు హర్ష యెర్నేని ఉగాది వేడుక దాతలు మాగ్నమ్ ఓపస్ ఐటి సాగర్ లగ్గిశెట్టి మరియు జీవీఆర్ రియాల్టీ విజయ్ గార్లపాటిని వేదిక మీదకు ఆహ్వానించారు. తదనంతరం “తామా” కార్యదర్శి వెంకీ గద్దె మాగ్నమ్ ఓపస్ ఐటి సాగర్ లగ్గిశెట్టిని పుష్పగుత్యాలు మరియు జ్ఞాపికతో సత్కరించారు. “తామా” విద్య కార్యదర్శి రాజేష్ తడికమళ్ల జీవీఆర్ రియాల్టీ విజయ్ గార్లపాటిని పుష్పగుత్యాలు మరియు జ్ఞాపికతో సత్కరించారు. డాక్టర్ పి వినయ్ కుమార్ని “తామా” ఈవెంట్ సెక్రటరీ ఇన్నయ్య ఎనుమల మరియు కోశాధికారి రామ్ బండ్రెడ్డి పుష్పగుత్యాలు మరియు జ్ఞాపికతో సత్కరించారు.
“తామా” ఉచిత ఆసుపత్రి తరుపున డాక్టర్ శ్రీహరి మాలెంపాటి ,డాక్టర్ చైతన్య సూర్యదేవర , డాక్టర్ ఆనంద చుండూరి ఉగాది సంబరాలకు విచ్చేసినారు. డాక్టర్ శ్రీహరి మాలెంపాటి డాక్టర్ చైతన్య సూర్యదేవర , డాక్టర్ ఆనంద చుండూరిని “తామా” ఉచిత ఆసుపత్రి అందించిన సేవలకు అభినందించి సత్కరించుకున్నారు.
నగరములో ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన దుకాణాలు, ప్రత్యేక ఆహారపదార్థాలు ,ఆభరణాలు ,వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. పండితులు ఫణికుమార్ గారి ఉగాది పంచాంగ శ్రవణం సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు మరియు తమ తమ రాశిఫలాల వివరాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా “శత పంక్తి భోజనాలు” వడ్డించడం జరిగింది. రుచికరమైన వివిధ రకాల వంటకాలు వచ్చిన ఆతిధులందరికీ మహదానందం పంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పదిహేను వందలకు పైగా వచ్చిన అతిథులకి భోజన ఏర్పాట్లు చేసిన “తామా” వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆడియో,లైటింగ్ ,వీడియో మరియు ఫోటోగ్రఫీ అందించిన “బైట్గ్రాఫ్” ప్రశాంత్ కొలిపార,మీడియా టీవీ 5 ,మన టీవీ మరియు టీవీ 9 అందించిన ప్రవీణ్ పురం మరియు భోజన ఏర్పాట్లు చేసిన ”పర్సిస్” బిర్యానీ అండ్ ఇండియన్ గ్రిల్’ శ్రీధర్ గారికి సభాముఖంగా “తామా” ప్రెసిడెంట్ హర్ష యెర్నేని కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీనివాస్ నిమ్మగడ్డ,శ్రీనివాస్ రాయపురెడ్డి,అనిల్ యలమంచలి ,సురేష్ ధూళిపూడి ,విజయ్ బాబు,అంజయ్య చౌదరి,భరత్ అవిర్నేని ,శ్రీనివాస్ లావు,ఉపేంద్ర నర్రా ,వెంకట్ అడుసుమల్లి , వినై కొత్తపల్లి,రాజేష్ జంపాల,మల్లిక్ మేదరమెట్ల,సునీల్,వెంకట్ పొలకం,ప్రసాద్ కుందేరు,జగదీష్ ఉప్పల,శ్రీనివాస్ ఉప్పు,ప్రశాంత్ పొద్దుటూరి,రమేష్ వెన్నెలకంటి,అరవింద్ మిర్యాల,మాధవ్ మట్ట,రాజ్ చింతగుంట,కరుణాకర్ బోయినపల్లి,అరుణ్ బొజ్జ,రవి కల్లి,శ్రీనివాస్ గుంటాక,రాకేష్ కున్నాత్ ,శివ రామ రాజు వేగేశ్న,విష్ణు వైదన, అవినాష్ గోగినేని,రమేష్ కొటికే,మాధవి అల్లాడి ,రామ్ మద్ది ,విజయ్ రావిళ్ల ,బాల నారాయణ మద్ద,మురళి కిలారు,శ్రీనివాస్ విప్పు,రమేష్ వెన్నెలకంటి ,సతీష్ బచ్చు,గణేష్ కస్సం,గిరి సూర్యదేవర, హరికృష్ణ ఎల్లప్రోలు,ఆదిత్య పాలమాకుల,శ్రావ్య శ్రీ ఎగలపాటి,పెదబాబు తుర్లపాటి ,శివ సబ్బి,నవీన్ పావులూరి ,ప్రశాంత్ వీరబొమ్మ , ప్రభాకర్ కొప్పులు, రాహుల్ తోటకూర ,రమేష్ యెర్నేని,రుపేంద్ర వేములపల్లి ,శ్రీనివాస్ యెర్నేని ,శరత్ వేమరాజు ,సునీల్ ఎడపగంటి,సురేష్ గాడిరాజు,కిషోర్ దేవరపల్లి,శ్రీధర్ దొడ్డపనేని ,శ్రీ హర్ష పులి,శ్రీనివాస్ రెడ్డి కొండా,లోకేష్ బోడేపూడి, రాజేష్ ఆలాగుండుల,రాజేష్ కొమ్మిశెట్టి ,రమేష్ సాగర్ కొటికే,భాస్కర్ పిల్లి ,రాజేష్ చెప్పప్రాపు,ప్రవీణ్ పురమ్,రామ్ మద్ది ,అరవింద్ మిర్యాల ,శ్రీకాంత్ కరి,బాలనారాయణ మద్ద,రమేష్ మెడా గార్లకి “తామా” కార్యవర్గం ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
చివరిగా గాయని సుమంగళి గారు మరియు గాయకుడు ధనుంజయ్ గారు విచ్చేసిన ప్రేక్షకులను తమ అద్భుతమైన మాస్ ,మెలోడీ పాటలతో ఉర్రుతలూగించారు . తదనంతరం సుమంగళి,ధనంజయ్ మరియు యాంకర్ మధుగారిని “తామా” కార్యవర్గ సభ్యులు పుష్పగుత్యాలు మరియు జ్ఞాపికతో సత్కరించారు.
“తామా” ఉపాధ్యక్షుడు మనోజ్ తాటికొండ ఉగాది ఉత్సవాలకు విచ్చేసిన ప్రేక్షకులకి మరియు సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్ ,స్పాన్సర్స్,పర్సిస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసి జాతీయ గీతంతో ఉగాది కార్యక్రమాలని దిగ్విజయంగా ముగించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.