Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

“తామా ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి!!!!”

By   /  April 15, 2016  /  No Comments

    Print       Email
D31_7731Telugu Association of Metro Atlanta (TAMA) is a 35 year old non-profit 501c (3) organization which represents the Indian Telugu community in Atlanta. We conduct many community events including cultural, community outreach, assisting community members in times of need and many more. We run a school for children which teach them Telugu. Most of the children who learn this do benefit from learning at least two languages, English at school and Telugu here. We also run a free clinic for any needy member who requires medical assistance. Our membership consists of a diversified group which includes Doctors, Engineers, Information Technology consultants as well as Entrepreneurs who run restaurants, gas stations as well as convenience stores.
Please publish below recap information of the following event in your esteemed publication. Please also find some photos and videos from the links below.
Photos:
Video short clip:
Video byte from Kaushal Manda – Actor:

తామా ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి!!!!

_____________________________________________________________
D31_8404ఏప్రిల్ 09 2016, అట్లాంటా నగరంలోని బెర్క్ మర్ స్కూల్ లో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి, అట్లాంటా తెలుగు సంఘం “తామా” వారి ఆధ్వర్యం లో జరిగిన ఈ సంబరాలకు నగరంలోని తెలుగు వారు వేయిమందికి పైగా పాల్గొన్నారు. Delta Information Systems మరియు అమెరికా తెలుగు సంఘం “ఆటా”  వారు సమర్పకులుగా తోడ్పడి ఆత్మీయ ఉగాది సంబరాన్ని అందించారు.
తామా సాంస్కృతిక కార్యదర్శి వెంకి గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సభని ప్రారంభించారు అలాగే తామా వారు నిర్వహిస్తున్న మనబడి, తామా క్లినిక్, తామా స్కాలర్షిప్ ల ప్రాముఖ్యత గురించి వివరించారు.
తదనంతరం తామ కార్యవర్గ సభ్యులని, బోర్డు సభ్యులని, Delta Information Systems అధినేత శ్రీనివాస్ లావు గారిని మరియు “ఆటా” సభ్యులని వేదిక మీదకి ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన గావించారు.
తర్వాత వెంకి గద్దె, ప్రముఖ నటుడు మరియు వ్యాఖ్యాత కౌశల్ మంద, నటి మధుశాలిని గార్లని వేదిక మీదకి ఆహ్వానించి సభకి పరిచయం చేసి సాంస్కృతిక కార్యక్రమాలని ఘనంగా ప్రారంభించారు. మధుశాలిని గారు మాట్లాడుతూ “తామా” తనకు కుటుంబంతో సమానం అని, తామా సభ్యులని మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ప్రసంగించారు. తనని ఉగాది సంబరాలకి ఆహ్వానించిన “తామా” వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు వ్యాఖ్యాత మరియు  నటుడు కౌశల్ మంద గారు.
నగరం లోని ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు, పాటలు, ఆలపించిన శ్లోకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి… ముఖ్యంగా మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు ప్రదర్శించిన ఫాషన్ షో వచ్చిన అతిధులని మంత్రముగ్ధుల్ని చేసాయి. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రశంస పత్రాలు అందజేసారు.
పండితులు ఫణికుమార్ గారి ఉగాది పంచాంగ శ్రవణం సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు మరియు తమ తమ రాశిఫలాల వివరాలను ఎంతో ఆసక్తిగా విన్నారు.
D31_8373తర్వాత, కాలిఫోర్నియా రాష్ట్రం నుండి వచ్చిన ప్రముఖ వైద్యురాలు హిమ బింది గారు వివరించిన “కాన్సర్ అవగాహన” విషయాలు అందరు ఆసక్తిగా తెలుసుకున్నారు.
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా బంతి భోజనాలు వడ్డించడం జరిగింది, రుచికరయమైన వివిధ రకాల వంటకాలు వచ్చిన అతిధులందరికీ  మహదానందం పంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి… వేయి కి పైగా అతిధులకి భోజన ఏర్పాట్లు చేసిన తామా వారిని ప్రతీ ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు.
“ఆటా” అధ్యక్షులు  కరుణాకర్ ఆసిరెడ్డి, అట్లాంటా ఆటా సభ్యులని, Delta Information Systems అధినేత శ్రీనివాస్ లావు గారిని, వ్యాఖ్యాత కౌశల్ మంద మరియు నటి మధుశాలిని గార్లని తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు శాలువా కప్పి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
తదనంతరం “తామా” అధ్యక్షులు వెంకట్ మీసాల, చైర్మన్ రామ్ మద్ది, శ్రీనివాస్ లావు, కరుణాకర్ ఆసిరెడ్డి ప్రసంగించారు.
ఫణి డొక్కా గారి దర్శకత్వం లో ప్రమోద్ సజ్జ గారు నిర్మించిన తెలుగు చిత్రం “పల్లకి” అవార్డ్స్ సాధించిన నేపధ్యంలో ఫణి డొక్కా గారిని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్దాలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి.
D32_6940చివరగా చెన్నుబొట్ల మరియు తోటి కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన తామా గానాభిషేకం అందరిని అలరించింది.
ఈ కార్యక్రమానికి  ఆడియో మరియు లైటింగ్ అందించిన “బీట్స్ & ఈవెంట్స్” వెంకట్ చెన్నుబొట్ల గారికి, వీడియో మరియు ఫోటోగ్రఫీ అందించిన “బైట్ గ్రాఫ్ ” ప్రశాంత్ కొల్లిపర గారికి మరియు భోజన ఏర్పాట్లు చేసిన “శ్రీ కృష్ణ విలాస్” సతీష్ ముసునూరి గారికి సభాముఖంగా తామా సాంస్కృతిక కార్యదర్శి వెంకి గద్దె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇంకా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతీ ఒక్కరికి తామా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →