Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Tammareddy Bharadwaj Sensational Comments ON TDP

By   /  March 21, 2018  /  Comments Off on Tammareddy Bharadwaj Sensational Comments ON TDP

    Print       Email
`హోదా` అంటే అరెస్టులు చేయించింది మీరు కాదా?
* మీకు హోదా ఇన్నాళ్ల‌కు గుర్తుకు వ‌చ్చిందా?
* మీరు ఎటు మాట్లాడితే మేమూ అలా మాట్లాడాలా?
* నిన్న‌టి వ‌ర‌కు మంచోడైన ప‌వ‌న్ ఇప్పుడు చెడ్డ‌వాడు అయ్యాడా?
* సినిమా వాళ్లు హోదా ఉద్య‌మం కోసం విశాఖ వ‌స్తే అరెస్టు చేయించ‌లేదా?
* వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది
* టీడీపీకి కౌంట‌ర్ ఇచ్చిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్‌
డెక్క‌న్ అబ్రాడ్‌: “తెలుగు సినిమా వాళ్ల‌కు ఏమీ చేత‌కాద‌ని.. సినిమా వాళ్లు ఏసీ రూంల్లో కూర్చుని కుల‌క‌డం.. డ‌బ్బులు తీసుకోవ‌డం త‌ప్ప వాళ్లు ఎందుకూ ప‌నికిరారు“ అని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌పై  ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, పోసాని కృష్ణ‌ముర‌ళిలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టాలీవుడ్‌కు సూక్తులు చెప్పేటప్పుడు… ముందు టీడీపీలో ఉన్న సినిమావాళ్ల సంగతేంటో చెప్పాలని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్నారు. పార్టీలో ఉన్నవాళ్లతో ప్రకటనను ఇప్పిస్తే… తర్వాత మిగిలిన వాళ్లు మాట్లాడతమన్నారు. తమిళనాడులో జ‌ల్లిక‌ట్టుకోసం పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటయ్యారని… ఏపీలో కూడా ప్ర‌త్యేక హోదా కోసం అందరూ కలిస్తే సినీ పరిశ్రమ కూడా తోడుగా ఉంటుందన్నారు. సినిమావాళ్లు హోదా ఉద్యమం కోసం విశాఖ వస్తే అరెస్ట్ చేయించింది ప్రభుత్వం కాదా అని త‌మ్మారెడ్డి ప్రశ్నించారు. పదవి ఉందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నవాళ్లకు ఇప్పుడు హోదా గుర్తొచిందా అని ప్రశ్నించారు.
నిన్నటి వరకు మంచోడైన పవన్ ఇప్పుడు చెడ్డవాడు అయ్యాడని… అలాగే ఆధారాలు లేకుండా పవన్ విమర్శలుచేయడం కూడా మంచిదికాదన్నారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు… ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. “ హోదా కోసం మాట్లాడిన వాళ్లను చెత్తవెధవలని మీరు నిన్నటి వరకూ అన్నారు. మళ్లీ మీరిప్పుడు సడన్ గా హోదా కావాలంటే మేం మద్దతు ఇవ్వాలా? అసలు హోదానే వద్దని చంద్రబాబు చెబతే మనస్ఫూర్తిగా నమ్మాం. ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో నిజం ఉంటుందని అనుకున్నాం. మళ్లీ ఇప్పుడు మాట మారిస్తే ఎలా” అని పోసాని కృష్ణ‌ముర‌ళి  ప్రశ్నించారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →