కేసీఆర్ రాజకీయంగా లొంగిపోయారు.. తమ్మినేని వీరభద్రం ఆరోపణలు..
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా లొంగిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్ పల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీ అయింది. ఇందులో మహాజన పాదయాత్ర సహా పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెల 19తో ముగియనున్న నేపథ్యంలో ముగింపు సభకు భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ కమిటీలో నిర్ణయించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా జనం తెలిపిన సమస్యలపై పరిష్కారం దిశగా సమీక్షించారు.
అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారులు పత్తి వేయవద్దని..రేటు రాదని పేర్కొంటున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రత్తికి రేటు బాగానే ఉందన్నారు. పప్పు ధాన్యాలు పండించాలని విస్తృతంగా ప్రచారం చేశారని అన్నారు. రూ. 12వేలు ఉన్న కంది ఇప్పుడు మూడు వేలు కూడా పలకడం లేదన్నారు. కంది ఎంత పండింది ? మద్దతు ధరతో ఎంత కొన్నారు ? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మోదీ నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎక్కువగా రైతలు, రైతు కూలీలపైనే పడిందని అన్నారు.
పాదయాత్ర సందర్భంగా తమ వ్యాపారలు బాగా దెబ్బతిన్నాయని చిరు వ్యాపారులు వాపోయారని చెప్పారు. ఇంత జరిగినా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారే తప్ప ప్రశ్నించడం లేదన్నారు. ఇప్పటివరకు మోదీ తెలంగాణకు ఏమీ చేయలేదని అన్నారు. ఇక విభజన ఒప్పందంలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రశ్నించడం లేదని చెప్పారు.కేసీఆర్ కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.