Loading...
You are here:  Home  >  Community Events  >  Charity  >  Current Article

TANA- Telugu Samithi of Nebraska Fund raiser for Cyclone Hudhud’s Relief

By   /  October 30, 2014  /  Comments Off on TANA- Telugu Samithi of Nebraska Fund raiser for Cyclone Hudhud’s Relief

    Print       Email

 

omaha10-2014-1

ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ బాధితుల సహాయార్ధం తెలుగు సమితి అఫ్ నెబ్రాస్కా, తానా సహకారంతో నిర్వహించిన సంగీత విభావరి ఆద్యంతం వినోదభరితంగా జరిగింది. అనూహ్య స్పందన రావడంతో కార్యక్రమ స్థలి కిక్కిరిసింది. కార్యక్రమం తెలుగు సంప్రదాయనృత్యంతో చిన్నారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా విచ్చేసిన తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ మాట్లాడుతూ తానా తెలుగు వారికి ఒక ప్రసిద్ద సంస్థ మాత్రమే కాకుండా ఇటు అమెరికా, కెనడా అటు మాతృభూమిలో కూడా 300 కోట్లకు పైగా వెచ్చించిన ఏకైక తెలుగు వారి సంఘంగా నిలవటం అందరికీ గర్వకారణం అన్నారు. అనుకోని ప్రమాదాల పాలయిన తెలుగు వారిని తానా ఆదుకుంటున్నతీరుని సభలోని వారంతా హర్షద్వానాలతో అభినందించారు.

InCorpTaxAct
Suvidha

 

omaha10-2014-2
omaha10-2014-3

నన్నపనేని మోహన్ TSN ప్రెసిడెంట్ అశోక్ మద్గపల్లి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కొల్లి సాదరంగా సన్మానించారు. శ్వేత వెల్లంకి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, గాయకులు హేమచంద్ర శ్రావణభార్గవి మిమిక్రి రమేష్ తో కూడిన బృందంతో సుమారు నాలుగు గంటల పాటు సాగిన సంగీత, వినోద కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగాపిల్లలూ, యువత, గాయనీగాయకులతో పాటు డాన్సు చేయటం చాలాబాగుంది.

 

తానా ప్రాంతీయ సమన్వయ కర్త, TSN ఉపాధ్యక్షుడు ప్రసాద్ కొల్లి చొరవతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి సహకరించిన TSN కార్యవర్గ సభ్యులు అశోక్ ముద్గపల్లి, సోమశేఖర్ కొడాలి, రాంబాబు కల్లేపల్లి, శివగంగ, వేణుగోపాల్ బోయిన పల్లి, నాగేశ్వరరావు ఆతోట, మహేష్ పరుచూరి, స్వరూప్ దేవినేని, మహేష్ గూడూరు, గోపాల్ ప్రవతి, శ్వేత వెల్లంకి, వేణు వెల్లంకి, శ్రీనివాస్ కర్రి, దేవి కటారు, మనోజ్ రేణుగుంట, ప్రసన్న ధర్మవరపు లను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందజేసిన తానా, డాక్టర్ చరణ్, శివగంగ తదితర దాతలకు ప్రసాద్ ముద్గపల్లి ధన్యవాదాలు చెప్పారు.

స్థానిక తెలుగు రెస్టారెంట్స్ అందరూ ఉచితంగా అందించిన రుచికరమయిన విందుతో సమావేశం ముగిసింది.

 

omaha10-2014-4

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →