Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు

By   /  April 28, 2014  /  No Comments

    Print       Email

ఏప్రిల్ 20, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్

ఉత్తరటెక్సస్తెలుగుసంఘం (టాంటెక్స్) సాహిత్యవేదికసమర్పించిన “నెలనెలాతెలుగువెన్నెల” 81 వసదస్సుఆదివారం, ఏప్రిల్ 20 వతేదిస్థానికడీ.ఎఫ్.డబ్ల్యూ.హిందూదేవాలయప్రాంగణంలోసాహిత్యవేదికసమన్వయకర్తఆదిభట్లమహేష్ఆదిత్యఅధ్యక్షతననిర్వహించబడినది. డాల్లస్పరిసరప్రాంతభాషాభిమానులు, సాహితీప్రియులుఅధికసంఖ్యలోఅత్యంతఆసక్తితోఈసమావేశానికిహాజరయిజయప్రదంచేసారు. ప్రవాసంలోనిరాటంకంగా 81 నెలలపాటుఉత్తమసాహితీవేత్తలనడుమసాహిత్యసదస్సులునిర్వహించడంఈసంస్థవిశేషం.

InCorpTaxAct
Suvidha

స్థానికచిన్నారివాస్కర్లశ్రియశ్రావ్యంగా“సాధుసుజనతోషిణి”గీతంఆలపించిసభనుప్రారంభించడంజరిగింది.ఉగాదిసందర్భంగాజరిగినకవిసమ్మేళనాన్నిస్థానికచిన్నారికస్తూరిప్రణవ్చంద్ర, అల్లసాని పెద్దనరాసినమనుచరిత్రనుండి“ప్రవరాఖ్యుడుహిమశైలం”గురించివివరిస్తున్నపద్యంశ్రావ్యంగావినిపించిప్రారంభించడంగమనార్హం.TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Audience TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_GoB and Sahitya Vedika Team TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Group 1 TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Group 2 TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Group 3

సాహిత్యవేదికసమన్వయకర్తఆదిభట్లమహేష్ఆదిత్యస్వాగాతోపన్యాసంలోతమస్వీయకవిత“ఉగాది.కాం”వినిపించిజయనామసంవత్సరఉగాదిశుభాకాంక్షలతోసాహితీప్రియులందరికీకవిసమ్మేళనానికిస్వాగతంపలికారు. కస్తూరి గౌతంచంద్ర నేటియువతరంఈకార్యక్రమంలొపాల్గొనడంచాలఅనందదాయకంఅనికొనియాడుతూగుర్రంజాషువగారి “బుద్ధదేవునిపునరాహ్వానం” నుంచిరెండుపద్యాలువినిపించారు.   శ్రీమతి పాలూరిసుజనతమకవితలో“ఎన్నికలలోఎన్నికలలో “, ప్రస్తుతఎన్నికలవాతవరణంమీదలీటెర్పెట్రోలు కొన్నవారికిస్కూటెర్ఫ్రీఅన్నట్లువంటిచెణుకులతోచక్కనికవితచదివిఅందరినీఆకట్టుకున్నారు.

ఆచార్యపూదూర్జగదీశ్వరన్టాంటెక్స్ఉగాదిపురస్కారాలమీదఆశువుగారాసినపద్యాలుకమ్మగాపాడిఅలరించారు. డా. గన్నవరపునరసింహమూర్తిస్వీయరచన “వసంతం” వర్ణిస్తూ “గగనతారలతలపుగరికపూలు” అంటూవసంతకాలంలొపూచేటెక్సాస్గడ్డిపూవులనివర్ణించారు. నెల్సన్మండేలానుఉద్దేశించిరాసిన “నల్లసింహం” కవితను “నల్లసింహమువిదిలించెనల్లజూలు..తెల్లఏనుగుభీతిల్లితల్లడిల్ల ” అంటూముగించారు.TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Group Photo

డా.జువ్వాడిరమణ, ఆదికవినన్నయపద్యంచక్కగాపాడిఅందరిమన్ననలుపొందారు. సాహిత్యవేదికసభ్యుడు నిమ్మగడ్డరామకృష్ణ “మధుమాసమిదేలే!” అనేస్వీయకవితనిచదివివినిపించారు. మల్లవరపుఅనంత్కాలప్రవాహంలొదాచుకున్నకవితనుదుమ్ముదులిపితెచ్చానుమీకోసంఅంటూగతంలొతానురచించినకవిత “కాలప్రవాహం” చదివివినిపించారు. కొండశ్రీకాంత్రెడ్డి,శ్రీనాధునిచాటువుచదివివినిపించారు. మద్దుకూరివిజయచంద్రహాస్స్వీయకవిత “అదే” చదివివినిపించారు. ఏలూరువాస్తవ్యులు, రిటైర్డ్తెలుగుఅధ్యాపకులుశ్రీపి. శివశంకర్రావ్టాంటెక్స్సాహిత్యవేదికపైతామురచించినస్వీయకవితవినిపించి, ప్రవాసాంధ్రులలోతెలుగుసాహిత్యాభిమానంగురించిప్రసంగించారు. ఆయలూరిబస్వి”తెలంగాణాలోతెలుగుసాహిత్యం” అనేఅంశంమీదచక్కని సమీక్షనుజనరంజకముగాసాహితీప్రియులతోపంచుకున్నారు.TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Kasturi Pranav

కుందేటిచక్రపాణి “గాలి , నేలవూరుసెలయేరు” అంటూచక్కనిపాటపాడిశ్రవణానందంకలిగించారు.సాహిత్యవేదికసభ్యుడుపున్నంసతీష్ “ఉగాదిఅదిగొఅరుదెంచె ” అనేవడ్డేపల్లిక్రిష్ణగారిఉగాదికవితతోఆరంభించిఈమాసంలొపుట్టినమహనీయులుకొందరినితలుస్తూ, హితకరిణిసంస్థస్థాపకులు, గద్యతిక్కనబిరుదాంకితుడైనకందుకూరివీరేశలింగంగురించి “మాసానికోమహనీయుడు” శీర్షికలొవివరించారు. సాహిత్యవేదికసభ్యుడైనబసాబత్తినశ్రీనివాసులు, మహాకవిశ్రీశ్రీకవితలుకొన్నిచదివారు. టెంపుల్, టెక్సాస్ నుంచివిచ్చేసినడా. వెంకటరాజుతానురచించిన “ఉగాదిశుభాకాంక్షలు” మరియు “తెలంగాణజయోస్తు” అనేకవితలనుఆహ్వానితులతోపంచుకున్నారు.

సాహిత్యవేదికసభ్యురాలుశ్రీమతిశారదసింగిరెడ్డి “మాతృభాషమధురత్వం” అనేస్వీయరచననుమధురంగాపంచుకున్నరు. టాంటెక్స్ఉత్తరాధ్యక్షులుడా. ఊరిమిండినరసింహారెడ్డి ‘తెలుగువేదం‘ మరియుకవిహృదయం‘ నుంచిప్రత్యేకంగాఎంచుకున్నకొన్నికవితలతోపాటు, మహిళలనుఉత్తేజపరచడానికితానుపొడుపుకథలుఎంచుకున్నానుఅనిఅందరిమెదడుకుపదునుపెట్టిఆకట్టుకుంటూ “ఉగాదిప్రసాదం” వడ్డించారు.TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Sahitya Vedika Team

విరామంలోస్థానికవిందురెస్టారెంట్వారందించినవేడి, వేడిఅల్పాహారం (పునుగు) మరియుతేనీరుఅందరూస్వీకరించారు. బొబ్బట్లు, ఉప్పుకారంతోపచ్చిమామిడిముక్కలుఉగాదికిగుర్తుగాప్రత్యేకఆకర్షణగానిలిచాయి. టాంటెక్స్అధ్యక్షుడుకాకర్లవిజయ్మోహన్మాట్లాడుతూఉగాదికవిసమ్మేళనం 81వసదస్సులోఅత్యంతఆసక్తికరంగాజరగడం, ఇంతమందిసాహితీప్రియులుహాజరుకావటంతమకుఆనందంగావుందిఅనివ్యక్తపరిచారు.టాంటెక్స్సంస్థ పాలకమండలి సభ్యుడు డా. సి.ఆర్.రావు, తక్షణ పూర్వాధ్యక్షుడుమండువసురేష్, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి వీర్ణపుచినసత్యం, కార్యవర్గసభ్యులుశ్రీమతివనంజ్యోతి, చామకూరబాల్కి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ, బండారు సతీష్ ఈకార్యక్రమంలోపాల్గొన్నారు.TANTEX 81st NNTV_Ugaadi Kavi Sammelanam_04202014_Vaskarla Sriya

సభనుముగించేముందుతెలుగుసాహిత్యవేదికకార్యవర్గబృందంవందనసమర్పణచేస్తూఉగాదికవిసమ్మేళనంపూర్తిస్తాయిలోచక్కగాజరిగినందుకుసంతోషిస్తూకార్యక్రమానికివిచ్చేసినవివిధసాహితీప్రియులకు, వేదికకల్పించినడీ.ఎఫ్.డబ్ల్యూహిందూదేవాలయయాజమాన్యానికి, ప్రసారమాధ్యమాలైన దేశీప్లాజా, రేడియో ఖుషి, టీవీ9, 6టీవీ, టీవీ5, టోరి (తెలుగు వన్)వారికిమరియువిందురెస్టారెంటుయాజమాన్యానికికృతఙ్ఞతాపూర్వకఅభివందనములుతెలియజేసారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →