Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

TANTEX Literary event

By   /  October 5, 2019  /  No Comments

    Print       Email

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం TANTEX వారి ఆధ్వర్యంలో 146 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు మరియు 43 వ టెక్సాస్ సాహిత్య సదస్సు ని అర్వింగ్ పట్టణంలో కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించబడడం జరిగింది.ఈ కార్యక్రమం దేశభక్తి గీతం తో మొదలయింది.తర్వాత సత్యం మందపాటి గారు పేరులో ఏముంది అనే అంశం పై మాట్లాడారు.హరి మద్ద్దూరి గారు చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా లిఖించాలన్న విషయం మీద మాట్లాడారు.నందివాడ భీమ రావు గారు సాహిత్యంలో ధిక్కారం అనే అంశం మీద మాట్లాడారు.సమాజంలో పేదలకి జరిగే అన్యాయం మీద ప్రశ్నించాలని చెప్పారు.మెడికో శ్యాం గారు సాహిత్యంలోని అనేక అంశాల మీద మాట్లాడారు.డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్ గారు పరీక్ష సమీక్ష అనే అంశం మీద మాట్లాడారు.తను  జర్నలిస్ట్ నండూరి రామ మోహన్ రావు గురించి కూడా  వివరించారు.ధారావాహిక కార్యక్రమంలో భాగంగా మన తెలుగు సిరిసంపదలు అనే అంశం గురించి డాక్టర్ నరసింహా రెడ్డి గారు వివరించారు.లెనిన్ ఎందరో మహానుభావులు – ఆధునిక సమాజపు కవితా ప్రయోజనం అనే అంశం మీద మాట్లాడారు.రామచంద్ర నాయుడు గారు సత్య హరిచంద్ర నాటకంలోని పద్యాలు పాడు వాటి భావనని వివరించారు.సురేష్ కాజా గారు గుర్రం జాషువా గారి గురించి వివరించారు.చంద్రహాస్ మద్దుకూరి గారు జాలాది గురుంచి వివరించారు.

చివరిగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్.హ్యూస్టన్,ఆస్టిన్,సానాంటోనియో,టెంపుల్ అనే పట్టణాల నుండి వందల మంది సాహిత్య ప్రియులు హాజరు కావడం జరిగింది. విచ్చేసిన సాహిత్య ప్రియులంతా స్వీయకవితలు,వ్యాసాలు,పద్యాలు,తెలుగు సిరిసంపదలు విని పులకించిపోయారు.ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణా రెడ్డి కోడూరు అధ్యక్షత వహించగా ,అధ్యక్షులు చిన సత్యం,కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి,కోశాధికారి శరత్ యర్రం,కార్యవర్గ సభ్యుడు సతీష్ తో పాటుగా పూర్వాధ్యక్షులు డా ఊర్మిండి నరసింహా రెడ్డి,సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,కృష్ణా రెడ్డి ఉప్పలపాటి,ప్రసాద్ తోటకూర,పాలకమండలి సభ్యులు, మాజీ అధినేత చంద్ర కన్నెగంటి గారు, డా.శ్రీనివాసుల రెడ్డి ఆళ్ళ,పాలకమండలి మాజీ అధినేత రామకృష్ణా రెడ్డి దంపతులు,అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం,శిరీష గోమటం సుమ పోకల,సి యస్ రావు,ఆర్ కె పండిటి,నందివాడ ఉదయ భాస్కర్,కిరణ్మయి వేముల ,తదితరులు సుమారుగా 200 మంది వరకు హాజరయ్యారు.

InCorpTaxAct
Suvidha

ఫోటోల కోసం కింది లంకెను చూడవచ్చు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →