Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

TANTEX Literary event

By   /  March 19, 2019  /  No Comments

    Print       Email

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 140 వసాహిత్య సదస్సును  ఆదివారం, మార్చి  17న డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారు విచ్చేశారు.

ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలై ,డాక్టర్ నరసింహారెడ్డి గారి మన తెలుగు సిరిసంపదలు ధారావాహిక కార్యక్రమం తో పాటుగా లెనిన్ గారు ప్రముఖ సాహితీ వేత్త డా.తుమ్మలపల్లి వాణికుమారి గారి రచనలు  ఊరు కొత్తబడింది,సాహితీ సౌజన్యం,ప్రాచీన కావ్యాలలో సాంస్కృతిక మూలాల పరిచయం,శ్రీ గారు రాఘవయ్య తప్పిపోయాడు అన్న అంశం మీద మాట్లాడిన తర్వాత  ముఖ్య అతిధి డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు.

InCorpTaxAct
Suvidha

ప్రొఫెసర్ వేమూరి గారు సైన్సు ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని నమ్మి, జనరంజక శైలిలో రాయాలనే కుతూహలంతో తను రాసే రాతలలో మానవీయ విలువలు ప్రతిబింబించవు.  హృదయానికి హత్తుకునే సంఘటనలు లేకపోవడమే కాదు కళ్ళని చెమ్మగిల్లించే కథనాలు అసలే ఉండవు కాని, సైన్సులో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా  ఆ పదజాలంతో వేమూరి నిఘంటువుకి ఎలా రూపకల్పన చేసారో కూడా వివరించారు.

వేమూరి గారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో పాటు డాక్టర్ అబ్దుల్ కలాం గారితో కలిసి DRDL లో పనిచేసిన అనుభవంతో పాటు తను ఎన్నో విద్యా సంస్థలలో విశ్వవిద్యాలయాలలో పని చేసి లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీ సంస్థలో 2012 లో పదవీ విరమణ చేసారు .

‘జీవరహశ్యం’, ‘రసగంధాయ రసాయనం’, ‘నిత్య జీవితంలో రసాయనశాస్త్రం’, అమెరికా అనుభవాలు’, ‘విశ్వస్వరూపం’, ‘ధర్మసంస్థాపనార్థం’, ‘రామానుజన్ నుండి ఇటూ, అటూ’, ‘ఫెర్మా చివరి సిద్దాంతం’, ‘చుక్కల్లో చంద్రుడు: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జీవిత చరిత్ర’, ’ ‘గుళిక రసాయనం (క్వాంటం కెమిస్ట్రీ ) ‘ , ఇలా ఎన్నో పుస్తకాలని రచించడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ అవార్డ్, వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి జీవిత సాఫల్య పురస్కారం, 11 వ రాధికా సాహితీ అవార్డులను పొందారు.

మూడు గంటలు  గడిచిన తర్వాత కూడా అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ, ఆహుతుల కరతాళ ధ్వనులతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు , ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి,  సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి , పవన్  నెల్లుట్ల , సాహిత్య వేదిక కమిటి సభ్యులు స్వర్ణ అట్లూరి, శ్రీ బసాబత్తిన ,డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

                        సాహిత్య వేదిక కమిటీ సభ్యులు ,ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు,పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారిని ,పుష్పగుచ్చాలు , జ్ఞాపిక , దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు.

  సాహిత్య వేదిక సమన్వయకర్త  కృష్ణారెడ్డి కోడూరు  సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన   టీవీ 5, మన టి.వి, టీవీ 9,టి.ఎన్.ఐ,దేసిప్లాజా లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.  కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2019-Events/Sahitya-Vedika-/140th-Nela-Nela-Telugu-Vennela-Sahitya-Vedika-March-17th2019/

 

 


If you like to publish your association news, please send email to editor@deccanabroad.com

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →