Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

TANTEX Sankranthi Sambaralu in Dallas TX

By   /  January 30, 2020  /  No Comments

    Print       Email

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో డాల్లస్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు:

డాల్లస్ /ఫోర్ట్ వర్త్

InCorpTaxAct
Suvidha

సంక్రాంతి లేదా సంక్రమణ అంటే చేరడం అని అర్థం.సూర్యుడు మకర రాశిలో చేరగానే వచ్చే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టం .భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు.అమెరికాలో తెలుగు వారు కూడా సంక్రాంతి పండుగని అంతే ఘనంగా జరుపుకొనేలా,అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ సంప్రదాయానికి పెద్ద పీట వేసి సంక్రాంతి సంబరాలని నిమిట్స్ హైస్కూల్ లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో,చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి పాటలతో అంబరాన్ని అంటే లాగ ఘనంగా జరుపుకున్నారు.ఎంతో మంది స్థానిక కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం,అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకి,తెలుగింటి ఆచారాలను,వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత,సాంస్కృతిక నృత్య అంశాలకి పెద్ద పీట వేసిన్దనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ మరియు పాలకమండలి తో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్,జొన్నలగడ్డ శ్రీకాంత్,సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని ఈ కార్యక్రమాలని నిర్వహించారు.సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్లుగా సభా ప్రాంగణాన్ని అలంకరించారు.

చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది. ప్రధాన వ్యాఖ్యాత సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించింది.ముద్దుగారే యశోద,వందే మీనాక్షి,కృష్ణాష్టకం,మాస్ ఈజ్ గ్రేట్,చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య సమాహారాలు ఆకట్టుకున్నాయి

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చిన సత్యం వీర్నపు 2019 లో జరిగిన కార్యక్రమాల గురించి వివరించారు.సంస్థకి సేవ చేయడం తన అదృష్టంగా అని తెలిపారు.

తదుపరి 2020 వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా తమ కార్యవర్గం,పాలకమండలి మరియు సంస్థ సభ్యులని కలుపుకొని సేవా రంగంలో కూడా ముందుంచి సంస్థ ఘన చరిత్రని కాపాడేలా నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని ప్రమాణం చేసారు. తనకున్న అనుభవంతో, సమాజంలో తనకున్న పరిచయాలతో సంస్థని మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని తీర్చి దిద్దుతానని తెలిపారు.తదనంతరం,2020 కార్యవర్గం మరియు పాలక మండలి బృందాన్ని సభకి పరిచయం చేసారు .

ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన గాయని గాయకులు దామిని భట్ల,ధనుంజయ మంచి మంచి పాటలతో విచ్చేసిన జన సందోహాన్ని ఉర్రూతలూగించారు.

పూర్వాధ్యక్షుడు చిన సత్యం ని,వారి కుటుంబాన్ని,2019 సంవత్సరంలో టాంటెక్స్ ఎన్నికల సంఘం కమిటీ సభ్యులని,చైర్ ఊర్మిండి నరసింహా రెడ్డి ని శాలువా కప్పి ,పుష్ప గుచ్చములతో,ప్రత్యేక జ్ఞాపికలతో అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు,ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి,ఉపాధ్యక్షులు ఉమా మహేష్,కార్యదర్శి సతీష్ బండారు,కోశాధికారి శరత్ యర్రం,సంయుక్త కార్యదర్శి మల్లిక్ కొండా,సంయుక్త కోశాధికారి కళ్యాణి తాడిమేటి మరియు కార్యవర్గ ,పాలక మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.

2019 వ సంవత్సరపు సాంస్కృతిక సమన్వయ కర్త కల్యాణి తాడిమేటి తనకి సంవత్సరం పొడవునా సహకరించిన కార్యకర్తల జట్టుకి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 2020 వ సంవత్సరపు సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని ని సభకి పరిచయం చేసారు.తదుపరి 2020 వ సంవత్సరపు సాంస్కృతిక బృందాన్ని సభకి పరిచయం చేయడం జరిగింది.

సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం మరియు పాలక మండలి తరుపున కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి,అతిధులకి ,పోషక దాతలకి అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు కృతఙ్ఞతలు తెలియచేసారు.

అటు పిమ్మట ఈవెంట్ స్పాన్సర్లయిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ,శరత్ యర్రం ,రాం మజ్జి , టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం,ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్,క్వాంట్ సిస్టమ్స్,ప్రతాప్ భీమి రెడ్డి,విక్రం జంగం,డా.పవన్ పామదుర్తి,శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి,DMR డెవలపర్స్ మరియు గోల్డ్ పోషక దాతలైన పసంద్ విందు ,మై ట్యాక్స్ ఫైలర్ ,రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి బసేరా హరి ,కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి మరియు సిల్వర్ పోషక దాతలైన మురళి వెన్నం,డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము,పెంటా బిల్డర్స్ ,ఒమేగా ట్రావెలర్స్,అవాంట్ టాక్స్ ,విశ్వభారత్ రెడ్డి కంది,శ్రీకాంత్ గాలి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

మీడియా పార్ట్నర్స్ అయిన ఏక్నజార్,ఫన్ ఏసియా,TV9, సాక్షి ,TV5,Mana TV,తెలుగు టైమ్స్,TNI,GNN,Sakshyam,Mydealshub మొదలయిన వారికి ధన్యవాదాలు తెలిపారు .

ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులు దామిని భట్ల,ధనుంజయ లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందు ని కూడా పుష్ప గుచ్చం,శాలువా ,జ్ఞాపికలతో సన్మానించడం జరిగింది

ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో,అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబారాలకి తెరపడింది .

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →