సెప్టెంబర్ 6, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన నౌకా విహారం దిగ్విజయం గా సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించబడినది. డాల్లస్ ప్రాంతీయ ఆడపడుచులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ విహారానికి విచ్చేసి ఆనందించారు.
సమన్వయకర్త స్వాగతోపన్యాసం తో మొదలైన సరదా సందడి చివరి వరకు ఉత్సాహంగా నడిచింది. భేల్ చాట్ తింటూ, మింట్ లస్సి తాగుతూ, భల్లె భల్లె నృత్యాలతో హాయిగా షికారు సాగింది. గరం గరం సమోసా కి చల్లని కొబ్బరి నీరు తోడై, కరుణించిన సూర్యదేవుని దయవల్ల చల్లని వాతావరణం లో విహారం హాయిగొలిపింది.
వనితా వేదిక కార్యవర్గ బృందం మండిగ శ్రీలక్ష్మి, పంచర్పుల ఇంద్రాణి, పాలేటి లక్ష్మి, సీలం క్రిష్ణవేణి, మెంటా మాధవి, బజ్జూరి లక్ష్మి, తోటా పద్మశ్రీ ల ఆధ్వర్యం లో అంత్యాక్షరి, బింగో వంటి సరదా ఆటలతో అందరూ ఆడి పాడారు. మై డీల్స్ హబ్ లో నౌకా విహారం వివరాలు చూసి కొంతమంది తమిళ వనితలు ఈ విహారం లో పాలు పంచుకొని, తెలుగు తమిళ పాటలతో భాష భేధం లేకుండా కలిసిపోయి ఆనందించారు.
వనితా వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ నౌకా విహారం లో పాల్గొన్న మహిళలకు, మై డీల్స్ హబ్ వారికి, కార్యక్రమ నిర్వహణలో అన్ని విధాల సహకరించి న టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు ఊరిమిండి నరసింహా రెడ్డి, కోశాధికారి వీర్ణపు చినసత్యం లకు, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మాధ్యమాలైన టివి 5, టివి 9, 6 టివి లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.