Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Tapsi given shock to Sundeep Kishan..!

By   /  February 3, 2016  /  Comments Off on Tapsi given shock to Sundeep Kishan..!

    Print       Email

Sundeep-Kishanసందీప్ కిషన్ కి షాక్ ఇచ్చిన తాప్సీ..!

 

InCorpTaxAct
Suvidha

అందాల తార తాప్సీ యంగ్ హీరో సందీప్ కిషన్ కి షాక్ ఇచ్చింది.ఆయనతో సినిమా నటించడానికి అంగీకరించిన తాప్సీ.. ఉన్నట్లుండి.. డేట్స్ ఇవ్వలేనని తప్పుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మంచి మంచి తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి.రాణాతో కలిసి ఘాజీ అనే మూవీలో నటిస్తోంది. ఇది తన కెరియర్‌ని మంచి ట్రాక్ లోకి తీసుకెళ్తుందని తాప్సీ నమ్ముతోంది.తెలుగులో అవకాశాలు రావడం లేదని కొంతకాలంగా ఫీలవుతున్న తాప్సీ.. వచ్చిన ఛాన్స్‌ని మాత్రం డేట్స్‌ వంక పెట్టి వదిలేసుకుంది. అయితే నిజంగా తాప్సీకి డేట్స్‌ లేవా..? లేక ఓ యంగ్‌ హీరోతో నటించడం వల్ల తనకి పెద్దగా ఉపయోగం లేదని భావించి వదిలేసిందా అన్నది మాత్రం తెలీదు.

 

Tapsiప్రస్తుతం తాప్సీ చేతిలో అయితే మంచి ఆఫర్సే ఉన్నాయి.కాని.. డేట్స్ సర్ధుబాటు చేయలేనంత బిజీగా అయితే లేదు.దీన్ని బట్టి చిన్న హీరో, చిన్న సినిమా అని ఆలోచించుకుని.. ఛాన్స్ వదిలేసిందని టాలీవుడ్ సినీ జనాలు చెప్పుకుంటున్నారు.ఈ మిల్కీ బ్యూటీకి ఒకప్పుడు మంచి పాపులారిటీనే ఉండేది.అయితే ఎలాంటి సినిమాలు చేయాలి.. ఎవరితో యాక్ట్ చేయాలి.. అన్న విషయాల్లో అవగాహన లేక.. వెనకబడిపోయింది.ఇది ఇప్పుడు తెలుసుకుందో ఏమో గాని.. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని.. యంగ్ హీరో తో ఛాన్స్ మిస్ చేసిందని అనుకుంటున్నారట.అయితే ఆమె ఎక్స్ పెక్ట్ చేసినట్లు తెలుగులో మంచి ఆఫర్లు రాకపోతే వచ్చిన ఛాన్స్ ని కూడా పొగొట్టుకున్నట్లు అవుతుంది కదా.. అని అనుకుంటున్నవాళ్లు ఉన్నారనుకోండి..!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →